<br/>రాత్రి 7 నుంచి 7.30 వరకు విద్యుత్ దీపాల ఆర్పివేత అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా మంగళవారం నిర్వహించే ‘బ్లాక్ డే (బిజిలీ బంద్)’ కు సహకరించాలని పార్టీ శ్రేణులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ రోజు రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా లైట్లు ఆర్పివేసి నిరసన తెలపాలని రాష్ట్ర ప్రజలకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.