అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది..

శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వెల్లువెత్తుతున్న వినతులు టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అసంతృప్తి నిదర్శమని బెల్లాల చంద్రశేఖర్,మామిడి శ్రీకాంత్‌ అన్నారు.పాదయాత్రలో అందరి సమస్యలు తెలుసుకుంటున్న వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ప్రజలకు న్యాయం చేస్తారని తెలిపారు. అన్నివర్గాలు ప్రజలు జననేతపై కొండంత నమ్మకంతో తమ సమస్యలు చెప్పుకోవడానికి తరలివస్తున్నారన్నారు.నాలుగునర సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదన్నారు. సాగునీరు అందించే కార్యక్రమాలు చేపట్టలేదన్నారు.రాజాం పట్టణంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు.బస్టాండ్,తోటపల్లి కాల్వ, రోడ్డు విస్తరణ వంటి సమస్యలు గత కొన్నేళ్లుగా నెలకొన్ని ఉన్నాయన్నారు.టీడీపీ ప్రభుత్వం పాలనలో టీడీపీ నేతలకు,కార్యకర్తలకు మాత్రమే లబ్ధిపొందుతున్నారన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కారం అవుతాయని తెలిపారు.
 


తాజా వీడియోలు

Back to Top