బీసీల కమిటీ స‌మావేశం ప్రారంభం

అమ‌రావ‌తి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ బీసీ అధ్యయన కమిటీ స‌మావేశం ప్రారంభ‌మైంది. అమ‌రావ‌తిలోని పార్టీ కార్యాల‌యంలో బీసీ అధ్యాయ‌న క‌మిటీ స‌భ్యులు స‌మావేశ‌మ‌య్యారు. కాగా, నిన్న బీసీ అధ్య‌య‌న క‌మిటీలో మరో ముగ్గురు సభ్యులను నియమించారు. కళ్యాణదుర్గంకు చెందిన బోయ తిప్పేస్వామి (వాల్మీకి), గుంటూరు జిల్లాకు చెందిన లలిత్‌కుమార్‌ (కుమ్మరి), పులివెందులకు చెందిన ప్రసాద్‌ (వడ్డెర)ను నియమిస్తూ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.


Back to Top