బీసీ వ్యతిరేకి చంద్రబాబు- చంద్ర‌బాబు చేస్తున్న వంచ‌న‌కు నిర‌స‌న‌గా బీసీలు క‌న్నెర్ర‌
- రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు
అమ‌రావ‌తి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు  వెనుకబడిన తరగతుల(బీసీ) వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు జంగా కృష్ణ‌మూర్తి విమ‌ర్శించారు. బీసీల ప‌ట్ల చంద్ర‌బాబు చేస్తున్న వంచ‌న‌కు నిర‌స‌న‌గా రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. విజ‌య‌వాడ‌లోని అలంకార్ సెంట‌ర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌కుమార్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో వారు పాల్గొని చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీల ప్రజయోజనాలకు చంద్రబాబు హరించి వేస్తున్నారని సజ్జల విమర్శించారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీల అమలును మరచిన చంద్రబాబు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌తోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు.  వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ‘వంచన, నయవంచన’ ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘వైఎస్‌ జగన్‌కు చంద్రబాబుకు స్ట్రెయిట్‌ ఫైట్‌ జరగబోతోంది. వైఎస్‌ జగన్‌కు అవకాశం ఇస్తే అభివృద్ధి, సంక్షేమం ఉంటాయి. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని బ్లూ ప్రింట్‌ రెడీ చేసుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అలుముకున్న చీకట్లను పారద్రోలాలంటే వైఎస్‌ జగన్‌కు నాయకత్వం అందించాలని అన్నారు. ‘ప్రజల సమస్యలు అసలే పట్టవు అనే తీరుగా టీడీపీ పాలన సాగిస్తోంది. సమస్యలు తీర్చకపోగా కొత్త సమస్యలు సృష్టించే విధంగా చంద్రబాబు పాలన తయారైంది. ఈ అరాచక పాలనతో రాష్ట్ర ప్రజానీకం విసిగిపోయారు. బాబు పాలన ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు’అని సజ్జల అన్నారు. విజయవాడలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలని అన్నారు. వచ్చే నాలుగు నెలలు పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు.

తాజా వీడియోలు

Back to Top