<br/>విజయవాడ: బీసీల సమస్యలపై నివేదిక తయారు చేసి వైయస్ జగన్‌కు ఇస్తామని, త్వరలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ బీసీ అధ్యయన కమిటీ సమావేశం శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీసీలకు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడిచి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. నిరుద్యోగులను మోసగించిన పార్టీ టీడీపీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల్లో సంచార జాతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. బీసీల సమస్యలపై చర్చించామని, సూచనలు, సలహాలు తీసుకున్నామన్నారు.