హైదరాబాద్) వైెఎస్సార్సీపీ శాసనసభ పక్షం సమావేశం హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగింది. పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైెఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి...పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. ఎమ్మెల్యే రోజాను అక్రమంగా సస్పెండ్ చేయటం, ఆమె హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొన్నప్పటికీ సభలోకి రానీయక పోవటం వంటి పరిణామాల మీద చర్పించారు. ముఖ్యంగా చట్ట సభను గుప్పిట్లో పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నఅరాచకాల్ని ప్రజాస్వామ్య యుతంగా ఎలా ఎదుర్కోవాలని అనే వంటి విషయాలపై దృష్టి పెట్టనున్నారు.