ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడింది వైయస్‌ఆర్‌

చిత్తూరు:

ప్రజాశ్రేయస్సు కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్, రుణామాఫీ చేశారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కరెంటు బకాయిలు కట్టని రైతులపై కేసులు పెట్టి, జైళ్లో పెట్టిస్తున్నాడని మండిపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో వందల కొద్ది హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని మరిచిపోయి ప్రజలను మోసం చేశాడన్నారు. జన్మభూమి కమిటీలను పెట్టి అధికారులు, ప్రజా ప్రతినిధుల స్థాయిని దిగజార్చుతున్నారని ధ్వజమెత్తారు. అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్‌ అందడం లేదని చెప్పారు. ఇకనైనా విలువలకు కట్టుబడే వారికే ప్రజలు పట్టం కట్టాలని కోరారు. 

Back to Top