తెలంగాణ‌లో వైయ‌స్ఆర్‌ జనచైతన్య బస్సుయాత్ర


 హైద‌రాబాద్‌:  తెలంగాణ రాష్ట్రంలో త్వరలో  వైయ‌స్ఆర్‌ జనచైతన్య బస్సు యాత్ర చేపట్టనున్నట్లు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నుంచి కరీంనగర్‌ జిల్లా వరకు పది రోజుల పాటు  వైయ‌స్ఆర్‌ జనచైతన్య బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలకు మేలు చేసే అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విధానాలను కొనసాగించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆ పథకాలను కొనసాగించాలని  చేపట్టనున్న జనచైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  రాష్ట్రంలో యాత్ర విజయ వంతం కావడానికి వీలుగా పలు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.  

బస్సు యాత్ర కమిటీలివే... 
- జనచైతన్య బస్సు యాత్ర కమిటి చైర్మన్‌గా మతీన్, సభ్యులుగా మహేందర్‌రెడ్డి, కె. శివ కుమార్, కొండా రాఘవరెడ్డి, బొడ్డు సాయి నాథ్‌రెడ్డి, బి.అనిల్‌కుమార్, కె.అమృతా సాగర్, డాక్టరు ప్రఫుల్లారెడ్డి, బి.సంజీవరావు, వెల్లాల రామ్మోహన్, బెంబడి శ్రీనివాస్‌రెడ్డి, శాంతికుమార్, బండారు వెంకటరమణ 
- క్రమశిక్షణ సంఘం(కమిటీ) చైర్మన్‌గా మతీన్, సభ్యులుగా అనిల్, వెల్లాల రామ్మోహన్, బి.సంజీవరావు, మహేందర్‌రెడ్డి. 
- రూట్‌మ్యాప్‌ కమిటీ చైర్మన్‌గా వెల్లాల రామ్మోహన్, సభ్యులుగా బొడ్డు సాయినాథ్‌రెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, ఎన్‌.రవికుమార్, బి.వెంకటరమణ, కుసుమ కుమార్, బెంబడి శ్రీనివాస్‌రెడ్డి, టి. జగదీశ్వర్‌ గుప్తా. ఆర్‌. చంద్రశేఖర్, డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి, బండారు వెంకటరమణ. 
- కరపత్రాల కమిటీ చైర్మన్‌గా బి.అనిల్‌ కు మార్, సభ్యులుగా శాంతికుమార్, భగవంత్‌రెడ్డి, డాక్టర్‌ ప్రఫుల్లారెడ్డి, ఎన్‌.రవికుమార్‌ 
- పోస్టర్‌ కమిటీ చైర్మన్‌గా బొడ్డు సాయినాథ్‌రెడ్డి, సభ్యులుగా ఎం. భగవంత్‌రెడ్డి, బి. బ్రహ్మానందరెడ్డి. 
- లీగల్‌ అనుమతుల కమిటీ ఇన్‌చార్జిగా ఎం. సరోజ్‌రెడ్డి,  
- బస్సు యాత్ర సాంస్కృతిక (పాటల)కమిటీ ఇన్‌చార్జిగా ఎన్‌.రవికుమార్‌. 

Back to Top