వైయస్‌ పథకాలకు కిరణ్‌ సర్కార్‌ తూట్లు

తిరుపతి‌, 3 సెప్టెంబర్‌ 2012 : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  సోమవారం ఇక్కడ ఆగ్రహం వ్యక్గం చేశారు. వైయస్‌ పేరు చెప్పుకుని గద్డెనెక్కిన వారంతా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఎలా మంగళం పాడాలా అని యోచనలు చేస్తున్నారని రామచంద్రారెడ్డి ఆరో్పించారు. రాష్ట్ర రాజకీయాల్లో పది రోజుల్లో పెనుమార్పులు జరుగుతాయని, ముఖ్యమంత్రిని మార్చితేనే కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్‌ ఉంటుందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాకు చెందిన వాడే అయినప్పటికీ కిరణ్కుమా‌ర్‌రెడ్డి జిల్లాకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. పది రోజుల్లో తన రాజకీయ భవిష్యత్పై ఓ నిర్ణయం తీసుకుంటానని పెద్దిరెడ్డి తెలిపారు. అసమర్థ పాలన కారణంగానే రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య తీవ్ర రూపం దాల్చిందని ఆయన దుయ్యబట్టారు. ప్రసిద్ధ శ్రీకాళహస్తి దేవాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాహు, కేతు పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

Back to Top