కాబోయే వ‌ధూవ‌రుల‌కు ష‌ర్మిల‌మ్మ ఆశీర్వాదం


బళ్లారి: అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమార్తె స్రవంతి వివాహం నేపథ్యంలో బళ్లారిలోని హవంబావి వద్ద ఉన్న కాపు నివాసంలో జరిగిన మెహందీ కార్యక్రమానికి  దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిలమ్మ హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా కాబోయే వ‌ధూవ‌రుల‌ను ష‌ర్మిల‌మ్మ ఆశీర్వ‌దించారు. రాజ‌న్న బిడ్డ రాగానే వైయ‌స్‌ కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.  ఆదివారం తెల్లవారుజామున స్థానిక అల్లం భవన్‌లో వీరి వివాహం జరగనుంది. Back to Top