వరంగల్ లో వైఎస్ షర్మిలకు ఆత్మీయ స్వాగతం..!

రాజన్న బిడ్డకు జన నీరాజనం..!
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వైఎస్సార్..!
వ‌రంగ‌ల్: వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు అపూర్వ ఆద‌ర‌ణ క‌నిపిస్తోంది.  జిల్లాలో రెండో దశ ప‌రామ‌ర్శ యాత్రలో వైఎస్ ష‌ర్మిల చురుగ్గా ప‌ర్య‌టిస్తున్నారు. ఆమె ప‌ర్య‌ట‌న‌లో స్థానికులు అడుగ‌డుగునా పాలు పంచుకొంటున్నారు. రాజన్న బిడ్డపై అదే అభిమానాన్ని, ఆప్యాయ‌త‌ను కురిపిస్తున్నారు. 

చనిపోయిన వారి కుటుంబాలకు ఆత్మీయ పలకరింపు..!
ఐదు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల్ని అడుగ‌డుగునా ప‌ల‌క‌రిస్తూ ఆత్మీయ‌త‌ను పంచుతున్నారు. మొదటి రోజు పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తం ఆరు కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారు. రెండో రోజు  మహబూబాబాద్ నియోజకవర్గంలో ఏడు కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి పూర్తి భరోసా కల్పించారు. ఇవాళ నర్సంపేట నియోజకవర్గంలో 4 కుటుంబాలు, ములుగు నియోజ‌క వ‌ర్గం లో ఓ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.

మాట తప్పని వ్యక్తిత్వం..!
దివంగత మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో దిగులు చెంది ప్రాణాలు వ‌ద‌ిలిన వారిని ప‌రామ‌ర్శించ‌టం త‌మ బాధ్య‌త‌గా వైఎస్ జ‌గ‌న్ భావించారు. ఈ మేర‌కు ఆయ‌న బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అనేక జిల్లాల్లో ప‌ర్య‌టించి ఆత్మీయంగా ప‌రామ‌ర్శించారు. అదే బాటలో నడుస్తూ ఆయన  మాట‌ను నిలబెట్టేందుకు వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల ప‌రామ‌ర్శ యాత్ర చేప‌ట్టారు.

మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది..!
ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పటికీ అందరి గుండెల్లో చిరస్మరణీయుడుగా ఉంటారని వైఎస్ షర్మిల అన్నారు.  సొంత బిడ్డల్లా భావించి ప్రజలకు భరోసా కల్పించిన వైఎస్సార్...వారి గుండెల్లో రాజన్నగా నిలిచిపోయారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను మనమే బతికించుకోవాలని... మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ మీద ఉన్న అభిమానంతో వచ్చిన ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా నమస్కరించారు. 
Back to Top