మూడో ఫ్రం‌ట్ కన్నా జగన్ ‌మాట ముఖ్యం

పాట్నా :

వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి వయస్సులో చిన్నవాడైనా సమాఖ్య స్ఫూర్తికి సంబంధించిన బలమైన వాదనను తెర మీదకు తెచ్చారని బీహార్ ముఖ్యమంత్రి నితీ‌శ్‌కుమార్ కితా‌బు ఇచ్చారు. మూడవ ఫ్రంట్ కంటే‌ శ్రీ జగన్ ‌చెబుతున్న అంశం మరింత ముఖ్యమైందని, తీవ్రమైందని ఆయన చెప్పారు. సాధారణ మెజారిటీతో రాష్ట్రాలు విభజించే విధానం గురించి దేశమంతా తీవ్రంగా ఆలోచించాల్సిందేనన్నారు.

శుక్రవారం సాయంత్రం శ్రీ‌ వైయస్ జగన్ తనను కలిసి వెళ్లిన తర్వాత నితీ‌శ్‌కుమార్ కాసేపు విలేకరులతో పిచ్చాపాటీ మాట్లాడారు. తనకు వై‌యస్ రాజశేఖరరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.‌ మహానేత డాక్టర్ వై‌యస్ మరణించినప్పుడు బీహా‌ర్‌లో రెండు రోజులు సంతాప దినాలుగా పాటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు‌ శ్రీ జగన్ పక్షాన ఉన్నారని, ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారంటూ.. తన దగ్గర ఉన్న సమాచారాన్ని విలేకరుల ముందుంచారు. మూడవ ఫ్రంట్ గురించి ఎన్నికల తర్వాత చర్చించాలని, ఇప్పుడు సమయం కాదని చెప్పారు.

బీహార్‌ ప్రభుత్వ అతిథిగా జగ‌న్‌ :
నితీశ్‌తో భేటీ కావడానికి వచ్చిన శ్రీ జగన్‌కు పాట్నా విమానాశ్రయంలో బీహార్ అధికార పార్టీ జేడీ(యూ) ఎంపీ అలీ అన్వ‌ర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఘన స్వాగతం పలికింది. బీహా‌ర్ ప్రభుత్వం ఆయ‌నను రాష్ట్ర అతిథి (స్టేట్ గె‌స్టు)గా పరిగణించింది. ఈ మేరకు అధికారిక వాహనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు భద్రత కల్పించింది. మరో వైపు శ్రీ జగన్‌ను స్వాగతిస్తూ పాట్నా తెలుగు అసోసియేషన్ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, బ్యానర్లు ఏర్పాటు చేసింది. దాదాపు 200 మంది తెలుగువారు విమానాశ్రయంలో‌ శ్రీ జగన్‌కు పుష్పగుచ్ఛాలందజేశారు. జై సమైక్యాంధ్ర, జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
]
‌తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నమే‌ శ్రీ జగన్ ‌పాట్నీ రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో సాయంత్రం 6.30 గంటలకు వచ్చారు.
తెలుగువారంతా ఆయన వచ్చేవరకు విమానాశ్రయంలో నిరీక్షించారు. స్వాగతం పలికినవారిలో వాసు, గౌరు సుబ్బారెడ్డి, రాజు, వెంకటరెడ్డి, సుధ తదితరులు ఉన్నారు. నితీశ్‌తో భేటీ తర్వాత విలేకరుల సమావేశం ముగిసిన వెంటనే శ్రీ జగన్ విమానాశ్రయానికి వె‌ళ్ళారు. ‌శ్రీ జగన్‌ కారు వద్దకు నితీశ్ వచ్చి మరీ వీడ్కోలు పలికారు. శ్రీ జగన్ అంతకు ముందు తన నివాసానికి చేరుకున్నప్పుడు కూడా కారు వద్దకు ఎదురు వచ్చి మరీ బీహార్ సీఎం నితీశ్ ‌స్వాగతం పలికారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top