జగన్ కిది పునర్జన్మ- వైయస్ విజయమ్మ

వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఇది పునర్జన్మ
అని తాను భావిస్తున్నాననీ, ఆయనపై దాడికి పాల్పడ్డ వారు ఎంతటి వారైనా ఇకపై ఇలాంటి
చర్యలకు పూనుకోవద్దని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ
ఉద్విగ్నంగా అన్నారు. ఆదివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ హత్యా యత్నం బారి నుండి
తృటిలో తప్పించుకున్న జగన్ ప్రజల కోసం మళ్లీ జనం మధ్య కోసం వెళుతున్నారని , అతడిని
కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏదైనా పనిని చేపడితే దానిని పూర్తి
చేసేంత వరకు కట్టుబడి ఉండాలని రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడూ చెపుతుండే వారని, అదే
కోవలో జగన్ తాను చేపట్టిన పాదయాత్రను పూర్తి చేయడానికి ముందుకు వస్తున్నారని ఆమె
స్పష్టం చేశారు. ఈ హత్యా యత్నం ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలన్నారు.

Back to Top