రాష్ట్రపతికి వైయస్‌ జగన్‌ లేఖ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నా«ద్‌ కోవింద్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖను వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాష్ట్రపతికి అందజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేలా చూడాలని లేఖలో వైయస్‌ జగన్‌ రాష్ట్రపతిని కోరారు. విభజన బిల్లు సందర్భంగా పార్లమెంట్‌ రసాభస చోటు చేసుకుందని, ఏపీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విడగొట్టారని లేఖలో పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించారన్నారు. ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని నాడు ఎంపీగా ఉన్న వెంకయ్య డిమాండ్‌ చేసినట్లు లేఖలో గుర్తు చేశారు. మార్చి 2, 2014న హోదా అంశాన్ని కేంద్రం ప్రణాళిక సంఘానికి పంపిందని వైయస్‌ జగన్‌ తెలిపారు. తర్వాత బీజేపీ, టీడీపీ ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పోటీకి దిగారన్నారు. చంద్రబాబు ఓ అడుగు ముందుకు వేసి 15 ఏళ్లు హోదా కావాలన్నారని లేఖలో తెలిపారు. గెలిచిన తరువాత రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి చంద్రబాబు ప్యాకేజీకి ఓటేశారని వైయస్‌ జగన్‌ వివరించారు. 
 
Back to Top