రాష్ట్రప‌తిని క‌ల‌వ‌నున్న జ‌న‌నేత‌

హైద‌రాబాద్‌) ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ నేడు రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ని క‌ల‌వ‌నున్నారు. న్యూఢిల్లీ లో ఇత‌ర కేంద్ర పెద్ద‌ల్ని కూడా క‌ల‌వ‌బోతున్నారు.
జ‌న నేత వైయ‌స్ జ‌గ‌న్ న్యూఢిల్లీ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారైంది. పార్టీ పార్లమెంట్ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ సాయంత్రం 6:45 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా మీద‌ కేంద్రం నుంచి స్ప‌ష్ట‌త రావ‌టం లేదు. దీని మీద పోరాడాల్సిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌టం లేదు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేయడంతో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతి ప్రణబ్ ను కలుసుకుని రాష్ట్ర విషయాలను ఆయనకు వివరించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుకు మద్ధతు ఇస్తున్న మరికొన్ని జాతీయ పార్టీల నేతలను కలవనున్నారు.  ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు తెలిపి, ఇవ్వని పక్షంలో రాష్ట్రం ఎదుర్కొనే విపత్కర పరిస్థితులపై రాష్ట్రపతికి వైఎస్ జగన్ తన పార్టీ ప్రతినిధులతో కలిసి వివరించనున్నారు. 
Back to Top