వైయస్‌ జగన్‌తోనే పేదల సొంతింటి కల సాకారం..

శ్రీకాకుళంఃపేదవాడి సొంతింటి కలను సాకారం చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.చంద్రబాబు పాలనలో ఒక ఇల్లు కూడా నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైయస్‌ఆర్‌ నిర్మించిన ఇళ్లకే చంద్రబాబు సున్నాలు వేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు.45 లక్షలకు పైగా పేదవారికి ఇళ్లు నిర్మించిన ఘన దివంగత మహానేత వైయస్‌ఆర్‌ది అని అన్నారు. దాదాపు మూడు లక్షల మాత్రమే విలువ  చేసే ఇళ్లకు నాలుగు లక్షలకు పెంచి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు.సామాన్యుడు ఇళ్లు కట్టుకోలేకుండా  చేశారన్నారు.వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారి సొంతింటి కలను నిజం చేస్తారన్నారు. తండ్రి ఆశయాల బాటలో పయనిస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేదలరికి నివాస యోగ్యం కల్పిస్తారన్నారు.పత్రికలు,కాగితాల్లో మాత్రమే చంద్రబాబు ఇళ్లు నిర్మించారని ఎద్దేవా చేశారు. ప్రచారం కోసమే చంద్రబాబు ప్రచారాన్ని వాడుకుంటారన్నారు.పేదలకు మేలు చేయాలనే తలంపు,చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదన్నారు.

తాజా వీడియోలు

Back to Top