ప్రజలతో వైయస్‌ జగన్‌ మమేకం



కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం చిన్నహుల్తి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని ప్రజలతో ఆయన మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు పలు సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. గౌడులకు ఇస్తున్న మాదిరిగానే తమకు 45 ఏళ్లకే పింఛన్లు ఇవ్వాలని యాదవ సంఘం నాయకులు కోరారు. యాదవుల అభ్యున్నతికి పార్టీ ఆలోచిస్తుందని, మన ప్రభుత్వం వచ్చాక తప్పకుండా న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.  రైతులు కూడా వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సాగునీరు ఇప్పించాలని గ్రామ రైతులు కోరారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత వైయస్‌ జగన్‌ను కలిశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్‌ కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని నిరుద్యోగులు వైయస్‌ జగన్‌ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
 
Back to Top