హైదరాబాద్: భారతదేశ 66 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు తదితర ప్రముఖులు హాజరయ్యారు.