మా పోరాటాలకు మేల్కొన్నారు

హైదరాబాద్‌: ఎట్టకేలకు మా పోరాటాన్ని చూసి దేశంతో పాటు టీడీపీ మేల్కొందని వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా పోరాటంపై వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. నాలుగేళ్ల నుంచి ప్రజల మద్దతుతో హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. వైయస్‌ఆర్‌సీపీని టీడీపీ మరోసారి అనుసరిస్తోందని తెలిపారు. ఇది ప్రజలు, ప్రజాస్వామ్య విజయమన్నారు. ప్రత్యేక హోదా, ఏపీ ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుందని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 
 
Back to Top