అమరావతి: నాలుగేళ్ల చంద్బరాబు పాలన ఓ విధ్వంసమని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షలు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
– ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో విద్రోహం..యువతకు ఉద్యోగాలు లేవు– రైతుల రుణాలను, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయలేదు– ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు.– విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేశారు– పేదలకు గృహాలను నిర్మించలేదు– ఇంధన ధరల్లో ఎలాంటి ఊరట ఇవ్వలేదు– అన్నింటా అవినీతి చెలరేగింది– ఇచ్చిన హామీల్లో వేటిని నెరవేర్చలేదు– ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారు– కేవలం గొప్పలు చెప్పుకున్నారు– నాలుగేళ్ల చంద్రబాబు పాలన ఓ విధ్వంసంగా సాగింది.– రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అని వైయస్ జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.