వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ సోమవారం వైయస్‌ఆర్‌ జిల్లాలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైయస్‌ జగన్‌కు ఎలాంటి విజ్ఞాలు జరగకుండా ఉండాలని విఘ్నేశ్వరుడికి వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.  వైయస్‌ జగన్‌ హత్యాయత్నం వెనుక టీడీపీ కుట్ర ఉందని మహిళలు ఆరోపించారు. ఈ కుట్రలో భాగమైన వారందరిని టీడీపీ నేతలు రక్షిస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లు ప్రజా సంకల్ప యాత్ర చేసిన వైయస్‌ జగన్‌కు ఎలాంటి విజ్ఞాలు జరగలేదని, ప్రజాదరణ రోజు రోజుకు అధికం కావడంతో ఆయనకు హాని తలపెట్టేందుకు కుట్ర చేశారన్నారు. ఈ కుట్రపై నిష్పక్షిక దర్యాప్తు జరగాలని డిమాండు చేశారు. 
 
Back to Top