నారాయణరెడ్డి భౌతికకాయానికి వైయస్ జగన్ నివాళి

కర్నూలుః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చెరుకులపాడులో నారాయణరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు.  నారాయణరెడ్డి భౌతికకాయానికి వైయస్ జగన్ నివాళులర్పించారు. నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవిరెడ్డి, కూతురుతో పాటు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. వైయస్ జగన్ తో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు నారాయణరెడ్డికి నివాళులు అర్పించారు.  

వైయస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున నారాయణరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. మరోవైపు, జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జిల్లా అంతటా వైయస్సార్సీపీ నాయకులు ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. టీడీపీ హత్యారాజకీయాలు నశించాలి, సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. నారాయణరెడ్డి హత్యతో జిల్లావ్యాప్తంగా విషాదచాయలు నెలకొన్నాయి. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top