ఓ భ్రమరావతి..ఓ రాజధాని..ఓ అవినీతి కథ

 



– నాలుగేళ్లలో 23 సార్లు బాబు విదేశాలకు వెళ్లి ఏం సాధించారు
– రాజధానిలో అన్నీ తాత్కాలిక భవనాలే
– రాజధాని కట్టే ఉద్దేశం చంద్రబాబుకు ఉంటే హైదరాబాద్‌లో ఇల్లు ఎందుకు?
– చంద్రబాబుకు దమ్ముంటే ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
– ప్రత్యేక హోదా మాయాజాలం అనే సినిమా నాలుగేళ్లుగా చూపిస్తున్నారు
– ఏప్రిల్‌ 20న చంద్రబాబు కొంగ జపం చేస్తారట
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక చదువుల విప్లవం తీసుకువస్తా
– మీ పిల్లలను చదివించే బాధ్యత నాదే
 
విజయవాడ: రాజధాని పేరుతో చంద్రబాబో ఓ సినిమా తీశారని, ఆ సినిమా పేరు ఓ భ్రమరావతి..ఓ రాజధాని..ఓ అవినీతి కథ అన్నారు. ఈ సినిమాలో హీరో లేడని ఉత్తమ విలన్‌ ఉన్నారని చెప్పారు. హీరో త్వరలో రాబోతున్నారని, ఆ విలన్‌ను బొక్కలో వేస్తారని పేర్కొన్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయవాడ వచ్చిన వైయస్‌ జగన్‌ నగరంలోని చిట్టి నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే..
–  ఈ రోజు గుంటూరు జిల్లాలో పాదయాత్ర ముగించుకొని కృష్ణ బ్యారేజ్‌ ద్వారా మీ జిల్లాలో అడుగుపెడుతుంటే..మీరు చూపిన ప్రేమా ఆప్యాయతలకు బ్యారేజీ కదిలిపోయింది. ఏ  ఒక్కరికి కూడా ఈ ఎండలో నాతో పాటు అడుగులో అడుగులు వేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇక్కడ ఎండలో, నడిరోడ్డుపై నిలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా కూడా ఒకవైపున అర్జీలు ఇస్తూ..కష్టాలు చెబుతూ..మరోవైపు అన్నా..నీ వెంట ఉన్నామని ధైర్యం చెబుతున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు
– చిట్టినగర్‌లోని 2 వేల మంది ఇక్కడే నివసిస్తున్నారు. రైల్వే శాఖ అధికారులు ఈ పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన ఎవరికి రాదు. పక్కనే చంద్రబాబు ఉన్నారు. కానీ ఆయనకు ఇక్కడి ప్రజల సమస్యలు పట్టవు. ఇక్కడ ఎమ్మెల్యే బీకాంలో ఫిజిక్స్‌చదివారు. ఆయనకు అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాదు. 
– నాలుగేళ్ల నారా వారి పాలన నీరు చక్రవర్తి ఫిడేల్‌ వాయిస్తున్నట్లుగా ఉంది. నాలుగేళ్లుగా రాజధానిలో ఒక ఇటుక కూడా పడదు. రాజధానిలో మాత్రం స్కాములు జరుగుతున్నాయి. అభివృద్ధి చంద్రబాబుకు గుర్తుకు రాదు. అవినీతి మాత్రమే ఆయనకు గుర్తుకు వస్తుంది. ఇదే నగరంలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ నుంచి కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు కూడా ఇదే పెద్ద మనిషీ పాలనలో కనిపించింది. 
– నాలుగేళ్ల క్రితం టీవీలో ఆయన వస్తే బాగుంటుందని ప్రకటనలు. ఆయన వచ్చిన తరువాత జరిగింది ఏంటీ?మహిళల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకొని వారి మానాలతో వ్యాపారం చేయించారు. వాళ్లను జైల్లో పెట్టి శిక్షించాల్సిన ఈ ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారం జరుగుతుందని కేసును తప్పుదోవ పట్టించారు.
– చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ ఏం చేస్తున్నారో తెలుసా? అక్రమంగా బస్సులు తిప్పుతారు. కేశినేని నాని బస్సులపై ఐపీఎస్‌ అధికారి కేసు పెడితే, ఆ అధికారిపై దాడికి ఆ ఎంపీ, ఎమ్మెల్యే వెళ్లి కాలర్‌ పట్టుకుంటారు. చంద్రబాబు సీఎంగా ఉండి అక్రమంగా ట్రాన్స్‌పోర్టు చేస్తున్న ఈ ఎంపీ దాడికి పాల్పడితే ..ఆ పోలీసు అధికారికి అండగా నిలబడకుండా పంచాయితీ చేశారు.
– ఇదే విజయవాడ నడిబొడ్డున చిన్న చిన్న భూములు రెగ్యులరైజ్‌ చేయడానికి ఈ మనిషికి మనసు రాదు. స్వాంతత్య్ర సమరయోధులకు ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు. 
– కృష్ణా నదిలో టూరిజం పేరుతో లైసెన్స్‌ లేని బోట్లు నడుపుతున్నారు.  ఈ బోట్లలో ప్రయాణం చేయిస్తూ ఏకంగా 23 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. సీఎం ఇంటి పక్కనే ఈ బోట్లు వెళ్తున్నా సీఎం ఏ  ఒక్కరిపై చర్యలు తీసుకోరు. చివరకు బోట్లు కూడా వదలకుండా నీకింతా..నాకింత అన్నట్లుగా లంచాలు పంచుకుంటున్నారు.
– ఇదే దుర్గమ్మ గుడిలో ఎప్పుడైనా విన్నామా? ఇలాంటి పవిత్ర స్థలంలో ఏకంగా చంద్రబాబు తాంత్రిక పూజలు చేయించి పవిత్రను నాశనం చేయించారు.
– మైక్‌ పట్టుకుంటే చాలు 2020 కల్లా ఏపీని సింగపూర్‌ చేస్తాను. 2050 కల్లా అమెరికా చేస్తాను. సముద్రాన్ని కూడా తీసుకొస్తాను అంటారు. 2015లో విజయవాడలో ప్లై ఓవర్‌ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. దివంగత సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 11 కిలోమీటర్ల ఫ్లై ఓవర్‌ హైదరాబాద్‌లో శంకుస్థాపన చేశారు..పూర్తి చేశారు. చంద్రబాబు ఒక్క ప్లై ఓవర్‌ కట్టలేని చంద్రబాబు అమెరికా గురించి మాట్లాడుతున్నారు. 
– నావద్దకు ఒక పెద్ద మనిషి వచ్చాడు. అన్నా..ఏయిర్‌పోర్టు నుంచి విజయవాడకు బైపాస్‌ తీసుకొని వస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవని చెప్పాడు. మంగళగిరి చెక్‌ పోస్టు మీదుగా ఆ రోడ్డు పోతుంటే, భూములు కూడా కొనుగోలు చేసి టెండర్లు పిలిచినా కూడా నాలుగేళ్లుగా ఒక్క  ఇటుక కూడా పడలేదు. బకెట్‌ కాంక్రిట్‌ పడలేదు.
–  ఒకసారి అలా సింగపూర్‌ వెళ్లి వచ్చి ట్రూప్‌ ట్రైన్‌ వస్తుందంటారు. అమెరికా వెళ్లి వచ్చి ఏయిర్‌ బస్సు వస్తుందంటారు. పక్కనే ఉన్న ప్లై ఓవర్‌ మాత్రం పూర్తి చేయలేకపోతున్నారు.
– చంద్రబాబు హాయంలో గ్రామాల్లో మంచినీళ్లు ఫోన్‌ కొడితే వస్తాయో లేదో తెలియదు. కానీ పోన్‌ కొడితే ఇంటికే మద్యం తీసుకువస్తున్నారు. విజయవాడలో 300పైచిలుకు మందుషాపులు, బార్‌ అండ్‌ ౖÐð న్‌ షాపులు ఉన్నాయి. ప్రజలతో బాగా తాపించే దిక్కుమాలిన ఆలోచన చంద్రబాబుది.
– ఎన్నికల సమయంలో ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తా అన్నాడు. పేదవాడి ఇళ్లతో కూడా అవినీతితో సొమ్ము ఎలా లాక్కోవాలని ఆలోచన చేస్తారు. 300 అడుగుల ప్లాట్‌ రూ.3 లక్షలతో నిర్మించుకోవచ్చు. చంద్రబాబు లంచాలు పుచ్చుకొని కాంట్రాక్టర్లకు అడుగుకు రూ.2 వేలకు ఇచ్చాడు. పేదవాడికి రూ.6 లక్షలకు చంద్రబాబు ప్లాట్లు అమ్ముతున్నారు. రూ.3లక్షలు పేదవాడికి అప్పుగా ఇస్తాడట. ఆ పేదవాడు 25 ఏళ్ల పాటు నెలకు రూ.3 వేలు ఆ పేదవాడు కంతులు కట్టాలట. ఇది చంద్రబాబు ఇళ్ల స్కాం
– ఇదే పెద్ద మనిషి నాలుగేళ్లుగా మనందరికి సినిమాలు బాగా చూపిస్తున్నారు. రాజధాని అంటూ సినిమాలు చూపిస్తున్నారు. రాజధాని ముసుగులో ఈయన తీసిన సినిమా పేరేంటో తెలుసా?ఓ భ్రమరావతి..ఓ రాజధాని..ఓ అవినీతి కథ
– ఆ కథ స్క్రిప్ట్‌ ఏంటో తెలుసా..? చంద్రబాబు స్కేచ్‌ గీస్తాడు. మొట్ట మొదట రాజధాని ప్రాంతం ఎక్కడో చంద్రబాబుకు తెలుసు. రాజధాని ఇ క్కడ రావడం లేదని నూజీవీడు ప్రాంతంలో వస్తుందని లీకులు ఇచారు. మరోసారి ఏలూరు ప్రాంతంలో అన్నాడు. చాలా మంది రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసేందుకు అక్కడికి వెళ్లారు. కానీ చంద్రబాబు తాను, తన బినామీలు తుళ్లూరు ప్రాంతంలో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి అనే వాడు రాజధాని ఫలాని ప్రాంతంలో వస్తుందని రైతులకు చెప్పి మేలు చేస్తాడు. చంద్రబాబు మాత్రం తన బినామీలతో భూములు కొనుగోలు చేయించి, ఇక్కడే రాజధాని వస్తుందని చెప్పారు. అడ్డగోలుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ఆయన్ను ఇన్‌సైడర్‌ట్రైడింగ్‌ కింద బొక్కలో వేయాలి. పదవి ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ రహస్యాలు చెప్పకూడదని ఉంది. అయితే చంద్రబాబు రాజధాని ఎక్కడ వస్తుందో తన బినామీలకు చెప్పారు. ల్యాండ్‌ ఫూలింగ్‌ అంటూ నోటీసులు ఇచ్చారు. కొంత మంది బినామీలను మాత్రం ల్యాండ్‌ ఫూలింగ్‌లో తీసుకొని వారికి బాగా మంచి ప్రాంతాల్లో ప్లాట్లు ఇచ్చారు. రైతులు ఎవరైతే బూములు ఇచ్చేందుకు ఇష్టపడలేదో వారిని నానా హింసలు పెట్టారు. ఎవరైనా చంద్రబాబును అడిగితే వీరు రాజధానికి వ్యతిరేకం అని బురద జల్లుతాడు. అంతటితో చంద్రబాబు భూదాహం ఆగలేదు. భూములు ఇవ్వని రైతుల అరటి తోటలకు నిప్పుపెట్టించారు. చివరికి పేదవారి అసైన్డ్, లంక భూములను కూడా లాక్కున్నారు. పేదవాడి భూముల జోలికి వెళ్లేందుకు ఎవరైనా బయపడుతారు. చంద్రబాబు రాక్షసుడు కాబట్టి ఆ పేదవాడి బూములను అడ్డగోలుగా దోచేశారు. తన బినామీలు రాజధాని ప్రాంతంలో బూములు కొనుగోలు చేసిన తరువాత వాళ్ల భూములను జోనింగ్‌ చేశారు. రియల్‌ ఎస్టేట్‌కు అనుకూలంగా ఉండే ప్రాంతంలో తన బినామీలను ఉంచారు. మిగిలిన రైతుల భూములను అగ్రికల్చర్‌ జోన్‌లో పెట్టారు. 

– చంద్రబాబు నాలుగేళ్లలో 25 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. ఒ కసారి సింగపూర్, మరోసారి టర్కి, దుబాయి అంటూ పిట్టల దొర మాదిరిగా బుల్లెట్‌ ట్రైన్, ఏయిర్‌ బస్సులు అంటూ మభ్యపెడతారు. తనకు నచ్చిన వారికి తనకు నచ్చిన రేటుకు అమ్ముకునేందు చంద్రబాబు ఆ భూములను అప్పగిస్తారు. 
– రాజధాని లో పర్మినెంట్‌ పేరుతో ఒక ఇటుక కూడా పెట్టరు. టెంపరరీ సెక్రటరీలో నిర్మాణానికి అడుగుకు రూ.10 వేలు ఇచ్చాడు. ఏ మాత్రం అవినీతి జరిగిందో ఆలోచన చేయండి. రాజధాని కట్టే ఉద్దేశం చంద్రబాబుకు ఉందా?. అదే పర్మినెంట్‌ సచివాలయం రూ.6 వేల చొప్పున కట్టించవచ్చు కదా? ఏ సినిమాకు వెళ్తే ఆ సినిమా సెట్టింగ్‌ అంటారు. ఒ క సారి బాహుబలి డైరెక్టర్‌ను పిలుస్తారు..ఆ సెట్టింగ్‌లు అంటారు. ఈయనకు రా«జధాని కట్టే ఉద్దేశం లేదు. తాను రాజధాని ప్రాంతంలో ఇల్లు కట్టుకోడు. హైదరాబాద్‌లో రాజభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారు. 
– రైతులను మభ్యపెట్టేందుకు ప్లాట్లు ఇస్తానంటారు. అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. రోడ్లు ఉండవు, డ్రైనేజీ ఉండదు. నీరు ఉండదు. అదిగో నీ ప్లాట్లు అంటూ భ్రమరావతి ..ఓ రాజధాని..ఓ అవినీతి కథ అంటూ సినిమా చూపిస్తున్నారు. ఇందులో హీరో లేడు. అంతా ఉత్తమ విలనే. ఆయన ఎవరో అందరికి తెలుసు. ఇక హీరో వస్తే తన్ని బొక్కలో వేస్తాడు. వేరే కార్యక్రమం లేదు.
– ఈ మధ్య కాలంలోనే బాబు రెండో సినిమా చూపిస్తున్నా. ప్రత్యేక హోదా..ఓ మాయాజాలం అనే సినిమా చూపిస్తున్నారు. నాలుగేళ్లుగా పోరాటం చేసిన తాను చంద్రబాబుకు ఏడు ప్రశ్నలు వేస్తున్నాను. దమ్ము, ధైర్యం ఉంటే ప్రజలకు సమాధానం చెప్పు. హోదా మాయజాలం సినిమాలో ఇదే పెద్ద మనిషిని ప్రశ్నిస్తున్నాను.

1.  మార్చి 2, 2014న రాష్ట్రాన్ని విడగొట్టిన అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని ప్లానింగ్‌ కమిషన్‌కు పంపించారు. చంద్రబాబు జూన్‌ 14, 2014లో సీఎంగా ప్రమాణం చేశారు. బాబు సీఎం అయిన ఏడు నెలల పాటు ప్లానింగ్‌ కమిషన్‌లో ఆ ఫైల్‌ అక్కడే ఉంది. ఆ ఫైల్‌ను ఇంప్లిమెంట్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు ప్లానింగ్‌ కమిషన్‌ను ఒక్కసారి కూడా కలువలేదు. ఏడు నెలల పాటు చంద్రబాబు గాడిదలు కాశారా? ఇది మోసం కాదా?అన్యాయం కాదా చంద్రబాబూ?
2. సెప్టెంబర్‌ 8, 2016న కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి మీడియా ముందుకు వచ్చి స్టేట్‌ మెంట్‌ ఇచ్చారు. హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ అని ప్రకటించారు. మొన్న ఇదే స్టేట్‌మెంట్‌ఇస్తే చంద్రబాబు శివాలెత్తారు. కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకున్నారు. ఆరోజు జైట్లీ ఇచ్చిన స్టేట్‌మెంట్, నిన్నటి స్టేట్‌మెంట్‌ రెండూ ఒక్కటి కాదా? అప్పడు ఎందుకు స్వాగతించావు చంద్రబాబు? అర్ధరాత్రి స్వాగతించారు. ఆ తరువాత ఢిల్లీకి వెళ్లి శాలువాలు కప్పారు. దన్యవాద తీర్మానాలు చేయించారు. అంతటితో ఆగకుండా హోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ప్రశ్నించారు. కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అన్నారు. జనవరి 2017లో చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి చేసినట్లు ఏ రాష్ట్రానికి చేయలేదని చెప్పారు. ఇంతదారుణంగా మోసం చేయడం అన్యాయం కాదా
3. ప్రత్యేక హోదా అవసరం లేదు అన్నట్లుగా చంద్రబాబు తప్పుడు లెక్కలు చూపించారు. ఏపీ మాత్రం దేశం కన్నా ఎక్కువగా, ప్రపంచం కన్నా ఎక్కువగా 12 శాతం జీడీపీ సాధించిందని చెప్పారు. విశాఖలో పార్ట్‌నర్‌సిఫ్‌ సమ్మిట్లు పెట్టి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని బయటి ప్రపంచానికి ఇవ్వడం న్యాయమేనా?
4.  ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాటం చేసినా తప్పుడు కేసులు బనాయించారు. వైయస్‌ఆర్‌సీపీ బంద్‌లు చేస్తే బలవంతంగా బస్సులు తిప్పారు. ధర్నాలు చేస్తే అడ్డుకున్నారు. యువభేరి కార్యక్రమాలతో చైతన్యవంతం చేస్తే..ఆ కార్యక్రమానికి వచ్చిన పిల్లలను పీడీ యాక్టు పెడతానని బెదిరించారు.
– ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ 7 రోజులు నిరాహార దీక్ష చేస్తుంటే..ప్రధానిని అడగాల్సింది పోయి చంద్రబాబు తన పోలీసులను పంపించి తెల్లవారు జామున ఆ టెంట్‌ను ఎత్తేసించారు.
5. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకపోతే చంద్రబాబు పెట్టేవారా? మార్చి 15న సాయంత్రం చంద్రబాబు ఏం చెప్పారో తెలుసా? సంఖ్యాబలం ఉంటేనే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామన్నారు. మరుసటి రోజు మార్చి 16న చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు అన్ని పార్టీల మద్దతు కూడగట్టింది కాబట్టి..జాతీయ మీడియాలో వస్తుందని తెలుసుకున్న చంద్రబాబు ప్లెట్‌ మార్చారు. తానే అవిశ్వాస తీర్మానం పెడతానని ముందుకు వచ్చారు. ఉసరవెళ్లి కన్న స్పీడ్‌గా ప్లెట్‌మార్చారు.
6. చంద్రబాబు అఖిలపక్షం అంటూ ప్రత్యేక హోదాను నీరుగార్చేందుకు డ్రామాలు మొదలుపెట్టారు. ఎవరు నిరసనలు తెలుపకూడదట. విద్యార్థులు ఉద్యమంలోకి వెళ్లకూడదట. కేవలం నల్లబ్యాడ్జిలు ధరించుకొని ఆఫీసులకు వెళ్లాలట. ఇలా చేస్తే కేంద్రం దిగి వస్తుందా?
7. చంద్రబాబు చేసే డ్రామాలు చూస్తే నాకు ఒక కథ గుర్తుకు వస్తుంది. ఒక సైనికుడు తుపాకి తీసుకొని యుద్ధానికి వెళ్లాడు. శత్రవు దగ్గరకు వచ్చినప్పుడు ఆ సైనికుడు ట్రిగర్‌ నొక్కితే బుల్లెట్‌ ముందుకు రాలేదు. యుద్ధంలో ఆ సైనికుడు నష్టపోయాడు. ఏపీలో సైనికుడు యుద్ధానికి బయలుదేరి తుఫాకి గురిపెట్టాడు. ట్రిగర్‌ నొక్కాడు. చంద్రబాబుకు సంబంధించిన ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణదీక్ష చేసి ఉంటే కేంద్రం దిగివచ్చేది కాదా? చంద్రబాబుది నకిలీ బుల్లెట్‌ కాబట్టి ఆయన ముందుకు రాలేదు. దగ్గరుండి చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామా చేయించలేదు. అందుకే ప్రత్యేక హోదా వెనక్కి వెళ్లింది. ఈ రోజు చంద్రబాబు ఓ మాట చెప్పారు. ఆయన పుట్టిన రోజు ఏప్రిల్‌ 20. అంటే నాలుగో నెల 20వ తేదీ. ఫోర్‌ ట్వంటీ ఆయన పుట్టిన రోజు. ఆ రోజు చంద్రబాబు కొంగ జపం చేస్తారట. ఎంపీల చేత రాజీనామా చేయించలేకపోగా, దగ్గరుండి వెన్నుపోటు పొడిచి ఏప్రిల్‌ 20న ఆయన నిరాహారదీక్ష చేస్తారట. నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్లు కాదా?
– ఇదే పెద్ద మనిషి ఎన్ని రకాలుగా మోసాలు చేయవచ్చో అన్ని రకాలుగా మోసం చేశారు. రైతులకు సంబంధించిన రూ.87 వేల కోట్లు మాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో బంగారం  ఇంటికి రావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. అధికారంలోకి వచ్చాక సిగ్గులేకుండా బుకాయిస్తాడు. అక్కా చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేసేశానని అబద్ధాలు చెప్పారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో అంటూ ప్రతి కులాని ఒక పేజీ కేటాయించారు. ఆ తరువాత బుకాయిస్తారు. తాను ఏమీ చేయకపోయినా కూడా చేసినట్లు బిల్డప్‌ ఇస్తూ తప్పు తనది కాదు కేంద్రానిది అంటూ తప్పించుకుంటారు. పేదవాడికి ఇల్లు ఇవ్వకుండా జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అబద్ధాలు..మోసాలు..అన్యాయాలు..అవినీతి చూశాం. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఇవన్నీ చూశారు కాబట్టి..ఇలాంటి వ్యక్తిని పొరపాటున క్షమిస్తే రేపు పొద్దున ఈయన ఏం చేస్తారో తెలుసా? ఈసారి చిన్న చిన్న అబద్ధాలు, మోసాలు నమ్మరని చంద్రబాబుకు తెలుసు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏమంటారో తెలుసా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతారా? నమ్మురు కాబట్టి ఇంకా ఏం చేస్తారో తెలుసా..? బంగారానికి బోనస్‌ బెంజి కారు ఇస్తానంటారు. ప్రతి ఇంటికి మనిషిని పంపించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బులు ఇస్తే మాత్రం వద్దనకండి..రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి లాక్కున్నదే. ఓటు వేసే సమయంలో మాత్రం మీ మనసాక్షి ప్రకారం వేయండి. మోసాలు చేసేవారిని, అబద్ధాలు చెప్పే వారిని బంగాళఖాతంలో కలపండి. ఇటువంటి అన్యాయమైన పాలన పోవాలి. రేపు పొద్దున రాజకీయ నాయకుడు చెప్పింది చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ వస్తుంది. జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి. 
– రేపు పొద్దున ఇటువంటి అన్యాయమైన పాలన పోయి..మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తామన్నది నవరత్నాల ద్వారా చెప్పాం. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలని నవరత్నాలు ప్రకటించాం. ఈ రోజు నవరత్నాల్లో నుంచి పేదవాడి పిల్లల చదువుల కోసం ఏం చేస్తామన్నది ఈ మీటింగ్‌లో చెబుతున్నాను.
– ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ప్రశ్నించుకోండి. మీ పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగా చదివించే పరిస్థితి ఉందా? ఇంజినీరింగ్‌ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ముష్టి వేసినట్లు రూ.35 వేలు ఇస్తుంది. మిగిలిన డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు. ఆ పేదవాడు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాడు. ఒక్కసారి నాన్నగారు వైయస్‌ఆర్‌ పాలన గుర్తుకు తెచ్చుకొండి.  ఆ రోజుల్లో నాన్నగారు పేదవాడు పేదరికం నుంచి బయటకు రావాలంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడైనా డాక్టర్, ఇంజినీరు వంటి గొప్ప చదువులు చదవాలి. మన పిల్లలు ఇంజినీర్లు చదవాలన్నా వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక భరోసాగా ఉండేవారు. నాన్నగారు చనిపోయిన తరువాత కథ మొదటికి వచ్చింది. పిల్లలను చదివించుకోవాలంటే అప్పులు చేయాల్సి వస్తోంది.
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక పేదవారి కోసం నాన్న ఒక్క అడుగు ముందుకు వేస్తే నాన్నగారి కొడుకుగా జగన్‌ రెండు అడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలను మీ ఇష్టం వచ్చినది చదివించండి..నేను భరిస్తా..ఎన్ని లక్షలైనా ఫర్వాలేదు. పిల్లలు హాస్టల్‌లో ఉండేందుకు అయ్యే ఖర్చుల కోసం రూ.20 వేలు ప్రతి ఏటా చెల్లిస్తాం. అంతేకాదు ఆ పిల్లలు ఉన్నత చదువులు చదవాలంటే పునాదులు ఆ చిట్టి తల్లుల నుంచి వస్తాయి. ఆ పిల్లలు బడి బాట పట్టి ఇంజినీర్లు, డాక్టర్లు అయితే మన బతుకులు మారుతాయి. అందుకే ప్రతి తల్లికి చెబుతున్నాను. ఆ తల్లులు తమ బిడ్డలను పంపిస్తే చాలు ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఈ రాష్ట్రంలో చదువు రాని వారు 32 శాతం మందికి చదువు రావడం లేదు. అలాంటి వారికి తోడుగా ఉండేందుకు మనందరి ప్రభుత్వం వచ్చాక చదువుల విప్లవం తీసుకువస్తాను. ఇందులో ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే అర్జీ తీసుకొని రావచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని మీ అందరిని కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను..


 
Back to Top