బాబుది ఫోర్‌ ట్వంటీ దీక్ష కాదా?

–  మూటలు..వాటాలు పంచుకునే వారిలో మంత్రి ఉమా ఒకరు
– పట్టిసీమ, పోలవరం, రాజధాని భూములు, ఇసుక మాఫియా అన్నింటిలో బాబు..ఉమా దోపిడీ
– కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకోవడానికి జీవోలు
– కాగ్‌ నివేదికలు చూసి కూడా నాకేంటి సిగ్గు అన్నట్లుగా ఉన్నారు
– బాబు పాలనలో కంట తడి పెట్టని ఆడపడుచు ఉందా?
– చంద్రబాబు పాలనంతా అబద్దాలే
– రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా అక్కా చెల్లెమ్మలను మోసం చేశారు
– ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను దగా చేశారు.
– ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేశారు
– వైయస్‌ఆర్‌ హయాంలో మండలానికో అంబులెన్స్‌ ఉండేది
– వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం
– ఎన్ని లక్షలు ఖర్చైనా ఫర్వాలేదు..ఉచితంగా ఆపరేషన్‌ 
– దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛన్‌ 
– నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క ఇల్లు కట్టించలేదు
– ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా

 కృష్ణా:  చంద్రబాబు తన పుట్టిన రోజు ఏప్రిల్‌ 20న ఒక రోజు దీక్ష చేస్తారట..ఆయనది ఫోర్‌ ట్వంటీ దీక్ష కాదా అని వైయస్‌ జగన్‌ అన్నారు. ఢిల్లీలో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసిన రోజున చంద్రబాబు కూడా తన ఎంపీలతో రాజీనామా చేయించి దీక్షలో కూర్చోబెడితే దేశం మొత్తం చర్చ జరిగేదన్నారు. కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేదన్నారు . కానీ ఆ రోజు చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించలేదన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఏప్రిల్‌20న బాబు కొంగ జపం చేస్తారని వైయస్‌ జగన్‌ విమర్శించారు. 

ప్రజా సంకల్ప యాత్ర 138వ రోజు కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.
– ఈ రోజు ఎండలు చాలా తీక్షణంగా ఉన్నప్పటికీ ఏమాత్రం ఎండలను ఖాతరు చేయకుండా నాతో పాటు కాలినడక నడిచారు. ఒక వైపున వారికి ఉన్న కష్టాలు చెబుతూ..అర్జీలు ఇస్తూ..మరోవైపు నా భుజాన్ని తడుతూ అన్నా..మేమంతా నీకు తోడుగా ఉన్నామని నాతో పాటు అడుగులో అడుగులు వేశారు. ఏ ఒక్కరికి కూడా ఈ ఎండలో నడవాల్సిన అవసరం లేదు. ఈ దుమ్ములో, రోడ్డుపై నిలవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. ఇవేవి కూడా లెక్క చేయకుండా చిక్కని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపుతున్నారు. ఆత్మీయతలు, ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరికి పేరు పేరునా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు
– మైలవరం నియోజకవర్గంలోకి రాగానే నాతో ప్రజలు అన్నమాట ఏంటో తెలుసా? అన్నా..అన్యాయపు రాజుగారి దర్భార్‌లో ఈయన ఓ అవినీతి మంత్రి అన్నా..అని నాతో అన్నారు. చంద్రబాబు మూడుపులు ఎంత రావాలో నిర్ణయిస్తే వాటిని మూటకట్టి చేరవేసి..అందులో వాటాలు పంచుకునే వారిలో ఈ మంత్రి ఒక్కరూ అని చెబుతున్నారు. పట్టిసీమ, పోలవరం, రాజధాని భూములు, ఇసుక మాఫియా వరకు ఆ రాజు, ఈ మంత్రి దోపిడీ టీడీపీ పాలనలో మనం చూస్తున్నాం. 
– ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి చంద్రబాబు సమక్షంలో జారీ చేసిన జీవో ఏంటో తెలుసా..22, 63..ఈ జీవో ఎంటో తెలుసా ? ఈపీసీ విధానంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎస్కలేషన్‌కు తావులేకపోయినా చంద్రబాబు అధికారంలోకి రాకముందే ఎక్కలేషన్‌ పేరుతో లంచాలు పంచుకుంటున్నారు. ఇవాళ వీళ్లు చేసిన దోపిడీని కాగ్‌ తేల్చింది. నా కేంటి సిగ్గు అన్నట్లుగా మంత్రి, చంద్రబాబు ఇద్దరూ కూడా ఉన్నారు. వీరు చేసిన అవినీతితో ఏం చేయాలో దిక్కు తోచక మన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు.వారితో రాజీనామా చేయించి గెలిపించుకునే సత్తా వీరికి లేదు.
– అన్నా..పురాణాలు చదివేటప్పుడు చాలామంది రాక్షసులు, భకాసుడు, రావనాసుడి పేర్లు విన్నాం. ఇక్కడ ఇసుకాసురులు ఉన్నారు. వీరిందరికి చంద్రబాబు బాస్‌. చంద్రబాబు తాను ఉంటున్న ఇల్లు కృష్ణ నది ఒడ్డునఅక్రమ కట్టడాల్లో సిగ్గులేకుండా ఉంటున్నారు. ఈ పెద్ద మనిషి ఇంటి పక్కనే, కళ్ల ఎదుటనే ఇసుక ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. ఉండవల్లి నుంచి వెంకటాయపాలెం, రాయపూడి, అప్పరాజుపాలెం తదితర గ్రామాల్లో చంద్రబాబు కళ్లముందే వేలాది లారీలతో ఇసుకను దోచుకుంటున్నారు. కృష్ణా నది ఇవతల కూడా మంత్రి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు చేపట్టి అవినీతికి పాల్పడుతున్నారు. లక్షల టన్నుల ఇసుకను తరలిస్తున్నా ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోవడం లేదు.దీని అర్థం విఫరీతంగా అవినీతి ఏస్థాయిలోకి వెళ్లిందో అర్థమవుతుంది. చిన్నబాబు నుంచి మొదలైతే పెద్దబాబు దాకా అవినీతిమయమైంది.
– ఇదే జిల్లాలో నాతో అన్న మాటలు ఏంటో తెలుసా? అన్నా..ఎన్నో పుష్కరాలు చూశామన్నా..కృష్ణా నది పుష్కరాలు అని చెప్పి రూ.1400 కోట్లు దోచేశారని చెబుతున్నారు. నీళ్ల పొట్లాలు, మజ్జిగ ప్యాకెట్లు, స్నానఘట్టాల్లో కూడా అవినీతి ఉంది. – ఇదే కృష్ణానదిలో లైసెన్స్‌ లేకుండా బోట్లు తిప్పుతున్నారు. ఆ బోట్లు తిప్పినందుకు కోట్లలో కమీషన్లు మంత్రులు, చంద్రబాబు పంచుకుంటున్నారు. లైసెన్స్‌ లేని బోట్లలో తీసుకెళ్తు 23 మంది అమాయకులు చనిపోయారు. మంత్రిని భర్తరఫ్‌ చేయకుండా చంద్రబాబు సిగ్గులేకుండా పాలిస్తున్నారు.
– మైలవరం నియోజకవర్గంలో వందకు పైగా కంకర క్వారీలు నిర్వహిస్తున్నారు. ఇంత చేస్తున్నా ఈ ప్రభుత్వం ఏమీ మాట్లాడటం లేదు. చంద్రబాబు అవినీతి పాలన ఏ స్థాయిలో ఉంది అంటే..రాజధాని భూముల స్కాం మనందరం చూశాం. ఫలాని ప్రాంతంలో రాజధాని వస్తుందని చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఇదే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బినామీలు తుళ్లూరు ప్రాంతంలో భూములు కొని, ఆ తరువాత తీరిగ్గా రాజధాని ఇక్కడ కాదు అక్కడ అని ప్రకటిస్తారు. కారు చౌకగా భూములు కొని చంద్రబాబు రైతులను మోసం చేశారు. ఈయన చేసిన ఇన్‌సైడర్‌ ట్రెడింగ్‌కు పాల్పడింది వాస్తవం కాదా?. రాజధానిలో జోనింగ్‌ విధానం అంటూ తానూ, తన బినామీల భూములు పోకుండా జోనింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన రైతులు వ్యవసాయ జోన్లలో వాళ్ల భూçములు ఉన్నాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– మైలవరం నియోజకవర్గం కృష్ణా నది నుంచి 29 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వేసవిలో తాగడానికి నీరు లేదు. బిందెలతో యుద్దాలు చేయాల్సి వస్తోంది. ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు ఎండిపోయి రైతులు అవస్థలు పడుతున్నారు. నియోజకవర్గం అంతా కూడా నీళ్ల కొరతతో అల్లాడుతున్నారు. ఇదే నియోజకవర్గంలో ఉన్న మంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. జి.కొండూరులోని తారక రామ ఎత్తిపోతల పథకాన్ని ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మూడు లిప్టులు పూర్తి చేశారు. మిగిలిన ఒక్క లిప్టు కూడా పూర్తి చేయలేని దద్దమ ప్రభుత్వం కాదా? నీటిపారుదల శాఖ మంత్రి సిగ్గుతో తలదించుకోవాలి.
– రైతులు నాతో అంటున్నారు. పసుపు, మిర్చి, జామాయిల్, సుబాబుల్‌ పండిస్తారు.  వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సుబాబుల్‌ టన్ను రూ.4400 అమ్ముకున్నామని, ఇవాళ రూ.2 వేలకు కొనుగోలు చేయడం లేదని రైతులు బాధపడుతున్నారు. జామాయిలు రైతులు కూడా అవస్థలు పడుతున్నారు. మామిడి రైతులు నష్టాల్లో ఉన్నారు. రైతులను గురించి ఆలోచన చేసే పరిస్థితి ఈ పాలకులకు లేదు. నిరుడు మిర్చి పంట రూ.2 వేలకు పడిపోతే ప్రతిపక్ష నాయకుడిగా రెండు రోజులు నిరాహార దీక్ష చేస్తే తప్ప ఈ పాలకుల్లో కదలిక రాలేదు. రైతుల పేరు చెప్పి దళారుల వ్యవస్థకు వీరే నాయకత్వం వస్తూ నాలుగేళ్లుగా రైతులకు రేట్లు రాకుండా అవస్థలు పడుతున్నారు.
– నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశాం. ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ నాలుగేళ్లలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? లేదు..కారణం ఈ పెద్ద మనిషే దళారి కాబట్టి..ఈయన హెరిటేజ్‌ షాపుకు లాభాలు వచ్చేందుకు తక్కువ రేటుకు కొనుగోలు చేసి దాన్ని ప్యాకు చేసి నాలుగింతల రేటుకు అమ్ముకుంటున్నారు. ముఖ్యమంత్రే దళారీలకు నాయకత్వం వహిస్తున్నారు.  ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని ఈ పెద్ద మనిషి చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో మీలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? .
–  రైతుల రుణాలు మాఫి కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. రూ.87 వేల కోట్ల రుణాలు మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల నుంచి మాత్రం ఇంటికి వస్తున్నాయి. చంద్రబాబు రుణమాఫి రైతులకు కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదు. చంద్రబాబు చేసిన అన్యాయం ఏంటో తెలుసా?గత ప్రభుత్వాలు రైతులు, పొదుపు మహిళలకు వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టేవి. చంద్రబాబు సీఎం అయ్యాక డ్వాక్రా గ్రూఫులకు, రైతులకు వడ్డీ డబ్బులు కట్టడం మానేశారు. ఏ బ్యాంకు కూడా సున్నా వడ్డీకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మానేశాయి.
– ఎన్నికలప్పుడు చంద్రబాబు అన్న మాట ఏంటి? పిల్లలంతా తాగి చెడిపోతున్నారు. అ ధికారంలోకి వచ్చాక మద్యం తగ్గిస్తాం. బెల్టు షాపులు ఎత్తేస్తాం అన్నారు. ఇవాళ ఏదైనా గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉందో లేదో కానీ, మద్యం షాపు లేని గ్రామం లేదు. చంద్రబాబు హైటెక్‌పాలనలో ఫోన్‌ కొడితే ఇంటికే మందు బాటిల్‌ తెస్తున్నారు. మైక్రో బేవరీలకు పర్మిషన్లకు అనుమతిస్తారట. ప్రతి టీ షాపులో కూడా మందు దొరుకుతుంది.
– చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు నాడు కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయని అన్నారు. సీఎం కాగానే కరెంటు బిల్లులు తగ్గిస్తా అన్నాడు. నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూసిన తరువాత అడుగుతున్నాను. బాబు సీఎం కాకముందు కరెంటు బిల్లు రూ.50, 70, 100 వచ్చేది. ఇవాళ రూ.500, 1000 కరెంటు బిల్లు వస్తోంది. నేరుగా కరెంటు వాళ్లు ఇంట్లోకి వచ్చి రూ.10 వేల జరిమానా వేస్తున్నారు.
– మనమంతా కూడా బియ్యం కోసం వెళ్లేది రేషన్‌షాపులకే. గతంలో రేషన్‌షాపుల్లో బియ్యం, కందిపప్పు, చక్కెర, కిరోసిన్‌ వంటి 9 రకాల సరుకులు ఇచ్చేవారు.  ఇవాళ బియ్యం తప్ప మరేవి ఇవ్వడం లేదు. ఇందులో కూడా వేలిముద్రలు పడటం లేదని కోత విధిస్తున్నారు. 
– ఆ రోజు ఏమన్నారు..పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు పూర్తిగా మాఫి కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. మాములుగా ఎవరైనా ఆడవాళ్లు కంట తడి పెడితే అరిష్టం అంటారు . చంద్రబాబు పాలనలో కంటతడి పెట్టని ఆడవాళ్లు లేరు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి అయినా చంద్రబాబు మాఫీ చేశారా? బ్యాంకు వాళ్లు మాత్రం ఇంటికి వేలం నోటీసులు పంపిస్తున్నారు. 
– రాష్ట్రంలో పెట్రోల్‌ ,డిజిల్‌ ధరల బాదుడే బాదుడు. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటూ మన రాష్ట్రంలో ప్రతి లీటర్‌పై అదనంగా రూ.7 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా బాదుడే బాదుడు. ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే భయం. బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నట్లు ఆర్టీసీ బస్సు టికెట్లు అమ్ముతున్నారు.
– జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చంద్రబాబు కనిపిస్తే రూ.96 వేలు బాకీ పడ్డావు ..ఎప్పుడిస్తావని నిలదీయండి. 
– ఈ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చే సరికి ఆయన చెబుతున్న మాటలు ఏంటో తెలుసా? తనకు అనుకూలమైన మీడియాను వాడుకుంటారు. ఒక అబద్ధాన్ని చెప్పి చెప్పి నిజమని చెప్పిస్తారు. రుణాలన్నీ మాఫీ చేసానని చెప్పారు. విశాఖలో పార్టనర్‌షిప్‌లు పెడతే రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయట. 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయట. మీకేమైనా కనిపించాయా? నోరు తెరిస్తే అబద్ధాలు..మోసాలు
– సీపీఎస్‌ రద్దు చేయాలని ఉద్యోగస్తులు రోడ్లపైకి వచ్చారు. నాలుగేళ్లుగా అందరిది ఇదే పరిస్థితి. ఇటువంటి మోసాలు చేసే వ్యక్తిని, అబద్ధాలు చెప్పే వ్యక్తిని పొరపాటున క్షమిస్తే..రేపు పొద్దున ఆయన మీ వద్దకు వచ్చి చిన్న చిన్న అబద్దాలకు, మోసాలకు నమ్మరని తెలిసి పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటారు. కేజీ బంగారానికి బోనస్‌ అంటారు. ప్రతి ఇంటికి బెంజి కారు కొనిస్తా అంటారు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి ప్రతి ఇంటికి తన మనిషిని పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బులిస్తే మాత్రం వద్దనకండి..రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి తీసుకున్నదే. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయమని మీ అందరిని కోరుతున్నాను. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలిపే పరిస్థితి రావాలి. 
–ఈ పెద్ద మనిషి ఏప్రిల్‌ 20న పుట్టిన రోజుట. అంటే ఫోర్‌ ట్వంటీ. ఆ యన పుట్టిన రోజు నిరాహార దీక్ష చేస్తారట. అయ్య చంద్రబాబు ఆ రోజు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. ఆ రోజు నీవు కూడా, నీ ఎంపీలు కూడా రాజీనామా చేసి నిరాహార దీక్ష చేసి ఉంటే దేశం మొత్తం దీని గురించి చర్చించి ఉండేది కాదా అ ని చంద్రబాబును అడగండి. ఆ రోజు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చుంటే చంద్రబాబు వారి ఎంపీలతో రాజీనామా చేయించి దీక్ష చేయించలేదు. అలాంటి 420 వ్యక్తి పుట్టిన తేదీ రోజు దీక్ష చేస్తారట. ఆ దీక్ష ఫోర్‌ ట్వంటీ దీక్ష కాదా? ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కావడమే మనం చేసుకున్న ఖర్మ. ఇటువంటి అన్యాయమైన పాలన పోవాలి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ రావాలి. ఇది జరగాలంటే ఒక్క జగన్‌ వల్లే సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. 
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలను ప్రకటించాం. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే నవరత్నాల ఉద్దేశం. ఈ రోజు నవరత్నాల్లో నుంచి పేదవాడి ఆరోగ్యం కోసం మనం ఏం చేస్తామన్నది చెబుతున్నాను. 
– ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. పేదవాడు ఎందుకు అప్పులపాలు అవుతాడంటే వైద్యం, విద్యకోసమే అప్పులపాలు అవుతారు. వైద్యం కోసం వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటారు. అటువంటి పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదని దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు ప్రవేశపెట్టారు. 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే చాలు 20 నిమిషాల్లో పేదవాడి ఇంటి ముందు అంబులెన్స్‌ వచ్చి నిలిచేది. నాన్నగారు మన మధ్య లేరు. ఇవాళ ఆరోగ్య శ్రీ పథకం ఎలా తయారైందో ఆలోచన చేయండి. గతంలో నాన్నగారి పాలనలో మండలానికో అంబులెన్స్‌ ఉండేది. అందులో అన్ని వసతులు ఉండేవి. జీతాలు సకాలంలో ఇచ్చేవారు.  ఇవాళ పరిస్థితి గమనించండి. నియోజకవర్గానికి రెండు అంబులెన్స్‌లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో రెండు అంబులెన్స్‌లు ఉంటే ఒక్కటి షెడ్డులో ఉంది. రెండో అంబులెన్స్‌కు స్టాఫ్‌ లేదని మార్కెట్‌యార్డులో పెట్టారు. నందిగామ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఇవాళ 108కు ఫోన్‌చేస్తే మూడు నెలలుగా జీతాలు లేవంటున్నారు. అంబులెన్స్‌కు డిజీల్‌ వేయించే పరిస్థితి లేదు. అనుకోకుండా పెద్ద రోగం వస్తే పెద్ద ఆసుపత్రికి వెళ్తాం. ఇవాళ పెద్ద ఆసుపత్రులన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు పాలనలో పరిస్థితి ఏంటో తెలుసా? వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ కట్‌ అంటున్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడం లేదు. వారికి బకాయిలు చెల్లించడం లేదు. ఇవాళ చిన్నపిల్లాడికి మూగ, చెవిటికి కాంక్లియర్‌ ఇన్‌ప్లాంట్‌ వైద్యం చేయించాల్సి వస్తే ఆరోగ్యశ్రీ వర్తించదట. ఆరోగ్యశ్రీ వైద్యం పేదవాడికి అందడం లేదు. క్యాన్సర్‌ పేషేంట్‌కు కిమో థెరపీ చేయించడం లేదు. కిడ్నీ పేషేంట్లకు డయాలసిస్‌ చేయడం లేదు. 
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాన్నగారు పేదవారికోసం ఒక అడుగు ముందుకు వేస్తే..నాన్నగారి కొడుకుగా జగన్‌ పేదవాడి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాను. ఎన్ని లక్షలు ఖర్చైనా ఫర్వాలేదు..ఉచితంగా వైద్యం అందిస్తాను. రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం, ఎంతటి పెద్ద ఆపరేషన్‌అయినా సరే ఉచితంగా చేయిస్తాం. ఆపరేషన్‌ తరువాత ఆ పేదవాడు విశ్రాంతితీసుకోవాలని డాక్టర్‌ చెబితే ఆ సమయంలో కూడా డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటాను.  తలసీమియ, డయాలసిస్‌ వంట దీర్ఘకాలిక రోగాలతో బాధపడే పేదవారికి నెలకు రూ.10 పింఛన్‌ ఇచ్చి అండగా ఉంటాను. 
– మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను. నాడు చంద్రబాబు ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నాడు. ఇల్లు కట్టిస్తామన్నారు. నాన్నగారి పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇల్లు కట్టించి దేశంతో పోటీపడ్డారు.  చంద్రబాబు పాలన చూశారు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం  అధికారంలోకి వచ్చాక ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తాను. ఆ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తాం. ఆ ఇల్లు అక్కచెల్లెమ్మలకు ఆస్తి రూపంలో ఉంటుంది. ఎప్పుడైనా డబ్బు అవసరమైతే ఆ ఇల్లు బ్యాంకులో పెడితే పావలా వడ్డీకే రుణం వచ్చేలా చేస్తాం. మిగిలిన అంశాలను రాబోయే సభలో చెబుతాను. వీటిలో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉంటానో మీ అందరికి తెలుసు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని మీ అందరికి కోరుతూ..సెలవు తీసుకుంటున్నా..
 

తాజా వీడియోలు

Back to Top