వీళ్లకి మెదడుందా..ప్రజాస్వామ్యం తెలుసా?

  • అగ్రిగోల్డ్ వ్యవహారంపై 20 నిమిషాలు మైక్ అడిగితే ఇవ్వలేదు
  • 20లక్షల మందికి టోపీ పెట్టి వేలకోట్లు మింగేసిన అతిపెద్ద స్కాం
  • ఆరోపణలు వచ్చినప్పుడు వినాలన్నా ఆరాటం కూడ లేదు
  • ఎంతసేపు టాపిక్ డైవర్ట్ చేయాలన్న ఆలోచనే
  • ఆస్తులను తన్నుకుపోయిన గద్దలమీద ఎంక్వైరీ జరగాలి
  • డిపాజిట్ దారులకు న్యాయం చేయాలి
  • వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ డిమాండ్
విజయవాడః ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న తీరు కౌరవసభ కన్నా దారుణంగా ఉందని, దేశంలోనే ఇలాంటి సభ ఎక్కడా జరిగి ఉండదేమోనని వైయస్ జగన్ అన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణం వ్యవహారంలో సాక్ష్యాధారాలు చూపిస్తూ బాధితుల తరపున మాట్లాడేందుకు   20 నిమిషాలైనా టైమ్ ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించిందన్నారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి  సంబంధంలేని అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం అగ్రిగోల్డ్ అంశాన్ని డైవర్ట్ చేసిందని ధ్వజమెత్తారు.  20నిమిషాలకన్నా ఎక్కువగా సమయం తీసుకోకుండా ప్రజల తరపున మీ అందరికీ ఈ సాక్ష్యాధారాలు చూపిస్తున్నా. అసెంబ్లీలో నాకు స్పీకర్ మైక్ ఇవ్వని పరిస్థితుల్లో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నానని వైయస్ జగన్ అన్నారు.  విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైయస్ జగన్ ఇంకా ఏమన్నారంటే......

ఆస్తులను గద్దల్లా తన్నుకుపోయారు
అగ్రిగోల్డ్ వ్యవహారం నాకు, ప్రత్తిపాటికి సంబంధించిన వ్యక్తిగత సమస్య కాదు. ప్రజలు అన్నీ చూస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులు వాళ్లంతట వాళ్లే ఆధారాలు తెచ్చి అసెంబ్లీలో చెప్పండన్నా అని నన్ను కోరారు. ఈ ఆస్తులన్నీ బయటకెళ్లిపోతే మాకు డబ్బులు రావన్నా. ఈ ఆస్తులను పెద్దమనుషులు గద్దల్లా తన్నుకొని పోవడం ఆగితేనే మళ్లీ ఆస్తులు అటాచ్ మెంట్ లోకి వస్తాయి. మాకు రావాల్సిన సొమ్ము కాస్తో కూస్తో వస్తుంది . లేకపోతే రాదని వాళ్లు సేకరించిన ఆధారాలు నాకు ఇచ్చారు. జరిగిన తీరంతా చూశాం. అగ్రిగోల్డ్ టాపిక్ జరుగుతున్నప్పుడు స్పీకర్ ఎలా మైక్ కట్ చేశారో,  టాపిక్ ఎలా పక్కకువెళ్లిపోయిందో చూశాం.  స్పీకర్ గతంలో ఓ ప్రెస్ మీట్ లో ఆడవాళ్లను కార్ షెడ్ లకు లింక్ చూస్తూ అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలను తీసుకొచ్చి డైవర్ట్ చేశారు. ఇవాళ కూడ అదే తీరు. ప్రతిపక్ష నాయకుడిగా అగ్రిగోల్డ్ వ్యవహారంపై మాట్లాడేందుకు 20 నిమిషాలు టైం ఇవ్వండి, అనంతరం మీరు మాట్లాడండి, ఆతర్వాత ప్రజలే డిసైడ్ చేస్తారు అని అడిగితే మైక్ ఇవ్వలేదు. గద్దల్లాగ ప్రభుత్వ నేతలే ఆస్తులు తినే కార్యక్రమం చేస్తున్నారని బాధితులు తమకు తాముగా ఆధారాలతో నా దగ్గరకు వచ్చారు.  20 లక్షలమందికి టోపీ పెట్టి వేలకోట్లను మింగేసిన అతిపెద్ద స్కాం అగ్రిగోల్డ్. ఈ స్కాంలో మంత్రి పుల్లారావు అనే వ్యక్తి చిన్నచీమలాంటి వారు. ఇతని మాదిరిగానే ఇంకా చాలామంది పెద్దమనుషులు పేర్లు బయటకు రావాలి. వీళ్ల చేతుల్లోంచి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడి అటాచ్ మెంట్ లోకి తెచ్చి డిపాజిట్ దారులకు మేలు జరిగేలా అమ్మి వాటిని పంచాలి. ప్రతిపక్ష నాయకుడిగా నేను చేస్తున్న పని మాట్లాడలేని వారి స్వరాన్ని వినిపించాలనుకున్నాను. దానికి వాళ్లు మాట్లాడుతూ పుల్లారావు అయినా లేకపోతే నేనైనా సభలో ఉండాలంట. ఆరోపణలు రుజువైతే ఆయన, నిరూపించకపోతే నేను వైదొలగాలని, ఎవరో ఒకరే ఉండాలని తీర్మానం చేయడం చూస్తే ఆశ్చర్యమేసింది. వీళ్లకు మెదడు ఉండి చేస్తున్నారా లేక చేస్తున్నారా అనిపించింది. దీనివల్ల అగ్రిగోల్డ్ బాధితుల కడుపులు నిండుతాయా...?వాళ్లకు మంచి జరుగుతుందా..? ఆరోపణలు వచ్చినప్పుడు వినాలన్నా ఆరాటం కూడ లేదు. ఎంతసేపు టాపిక్ డైవర్ట్ చేయాలన్న ఆలోచనే. స్పెక్ట్రమ్, బోఫోర్స్, కోల్డ్ స్కాం ఇవన్నీ ఎంక్వైరీలకు ఎలా పోయాయి. ప్రతిపక్షంలోని వాళ్లు ఆధారాలతో  పార్లమెంట్ లో మాట్లాడితే అదికార, ప్రతిపక్షాల మధ్య చర్చ జరిగి ఎంక్వైరీకి వేసినప్పుడు ఈ స్కాంలు బయటకొచ్చాయి. 

ప్రతిపక్షం ఏం చేయాలన్న పాత్ర వీళ్లకు తెలుసా
అన్ని ఆదారులున్నాయని బాధితులు వారిచ్చినవి చూపించడానికి 20 నిమిషాలు కావాలంటే మైక్ కట్ చేయడం, చాలెంజ్ అనే పేరు తెచ్చి టాపిక్ డైవర్ట్ చేయడం దారుణం. బాబుకు చాలెంజ్ మీద నమ్మకముందే ఇదే సభలో చాలెంజ్ అని నేను ఎన్నోసార్లు అన్నా. ఏనాడైనా పలికాడా. మా 21మంది శాసనసభ్యులను ప్రలోభాలు, డబ్బులిచ్చి తీసుకున్నావ్. ప్రజలు నీ పార్టీకి ఓట్లేయలేదు. వాళ్లు మా పార్టీ గుర్తుపై గెలిచారు.  సంవత్సరం నుంచి వాళ్లను డిస్ క్వాలిఫ్ చేయకుండా బాబు, స్పీకర్ కాపాడుతున్నాడు. సిగ్గులేకుండా వాళ్లంతా అధికారపక్షం బెంచుల్లో కూర్చున్నారు. స్పీకర్ ఎదురుగా సీట్లో కూర్చోబెట్టారు. బాబు నీకు ప్రజలకు మంచి చేశానన్న నమ్మకముంటే ప్రజల దగ్గరకుపోదాం. ప్రజలు ఇచ్చే దాన్ని రెఫరెండంగా తీసుకుందా. మాకు మెజారిటీ వస్తే నీవు పదవినుంచి తప్పుకో అని సవాల్ విసిరితే తీసుకోలేదు. ఎందుకంటే అది నచ్చదు.  కోట్లాది రూపాయలు ఇచ్చి తెలంగాణలో ఆడియో, వీడియోల్లో దొరికిన ఏకైక ముఖ్యమత్రి బాబు. అలా సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికాక సుప్రీంకోర్టులో కేసు విని న్యాయమూర్తులు నోటీసులు ఇచ్చారు. ఆ గొంతు బాబుది కాదని నిరూపించగలడా అని చాలెంజ్ విసిరాం. దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే ఆయనకు నచ్చదు. ఆయన చాలెంజ్ తీసుకోడు.  టాపిక్ డైవర్ట్ చేసేందుకు అవతలోళ్లు రెచ్చిపోయి చాలెంజ్ తీసుకోవాలట. లేకపోతే తప్పుచేసినట్లట. వీళ్లకి అసలు ప్రజాస్వామ్యం తెలుసా. ప్రతిపక్షం ఏం చేయాలన్న పాత్ర వీళ్లకు తెలుసా. ప్రతిపక్షాన్ని మాట్లాడనీయాలి. ప్రతిపక్షం దగ్గర ఏవైనా సాక్ష్యాధారాలు వచ్చినప్పుడు తెలుసుకోవాలన్న తపన ఉండాలి. ఆ సాక్ష్యాధారాలు విని పస ఉంటే ఎంక్రైరీకి ఆదేశించాలి. అప్పుడు డెమోక్రసీ అనిపించుకుంటుంది. 

బాబు కొడుకు, ఎంపీల హస్తముంది
కర్మ ఏంటంటే పుల్లారావు దగ్గర్నుంచి హాయ్ లాండ్ ఆస్చులు ఎందుకు ఆంక్షన్ వేయడం లేదో ఎవరికి తెలవడం లేదు. ఏరాడలో 116 ఎకరాల రిసార్ట్స్ ప్రైం ప్రాపర్టీ ఆక్షన్ ఎందుకు వేయడం లేదో ఎవడికి తెలవడం లేదు. అతిహోయ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ ఆక్షన్ ఎందుకు రావడం లేదో చెప్పరు. వాల్యూవున్న వీటి మీద ఆక్షన్ వేయడం లేదు. వీటిలో ఎంపీల హస్తముంది, బాబు కొడుకు హస్తముందని ఆరోపణలున్నాయి. ఎందుకు ఆక్షన్ కు రావడం లేదు. సంవత్సరన్నర అయిపోయింది. బాధితులకు వచ్చింది 16కోట్లు మాత్రమే. వాళ్ల బాధ ఎవరు తీరుస్తారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువలు 19లక్షల 50వేలమందికి సంబంధించి రూ. 3900కోట్లు. కేవలం రూ. 1182కోట్లు ఇస్తే 13లక్షల 83వేలమందికి న్యాయం జరుగుతుందని చెప్పారు. డిపాజిట్ దారులొచ్చి అన్నా మన బడ్జెట్ లక్షా 50వేల కోట్లు . చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యేలా మనసు కరిగేలా గట్టిగా వినిపించడన్నా అని కోరారు. రూ.14లక్షల కుటుంబాలు బాగుపడుతాయని వారు అడిగిన మేరకు జాగృతి చేస్తే ఆయనకు ఎక్కదు. అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇచ్చే తీర్మానాలు ఇవ్వడు. దాని గురించి మాట్లాడేవారిని ఎలా కట్టడి చేయాలనే దానిపై మాత్రమే తీర్మానాలు చేస్తారు. ఇప్పటివరకు ఈ స్కాంకు సంబంధించి ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారు. చైర్మన్ ఆయన తమ్ముడు. దాదాపు 8మంది అన్నదమ్ములు, బంధువులు అగ్రిగోల్డ్ కంపెనీల్లో డైరెక్టర్లుగా వున్నారు . వీళ్లు ప్రజల దగ్గరున్న డబ్బులను మిస్ అప్రాప్రియేట్ చేసి ఆడబ్బులతో బయట ప్రాపర్టీస్ కొని ఆస్తులు అమ్ముకుంటున్నారని అసెంబ్లీ దృష్టికి తెచ్చాం. ప్రత్తిపాటి ఒక్కడే కాదు తిరుపతిలో వెంకటాద్రి హోటల్ ఆ డబ్బులతో ఎకరం చిల్లర  14కోట్లు అమ్మేశారు. ఇదొక్కటే కాకుండా బ్రహ్మంగారి మఠంలో సీతారాం అనే డైరెక్టరు ఆయన భార్య, కూతురు బంధువులు భూములు 2016లో కూడా అమ్మారని ఆధారాలతో సహా చూపించాం. వాళ్లు రాజకీయాలకు సంబంధం లేదు వాళ్లు. ప్రత్తిపాటి ఒక్కడే కాదు అందరి గురించి చెప్పాం. ఇవి వినాలన్న ఆరాటం లేదు.  హాయ్ లాండ్ , ఏరాడలో, అతిహోయలో ఆక్షన్ ప్రాపర్టీస్ పై నిలదీస్తామని భయపడుతున్నారు. 

డిపాజిట్ దారులకు న్యాయం చేయాలి
మంత్రి పుల్లారావు భార్యకు భూములు అమ్మిన వ్యక్తి ఉదయ్ దినకరన్. ఈ వ్యక్తి అగ్రిగోల్డ్ సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నాడు. హాయ్ ల్యాండ్ ప్రాపర్టీలో డైరెక్టర్ గా ఉండి దాన్ని ఆపరేట్ చేస్తున్న కంపెనీ ఆర్కా లీజర్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్. ఈ కంపెనీలో 2010 మార్చి 8నుంచి  డైరెక్టర్ గా ఉన్నాడు. ఈ పెద్దమనిషి ఆ ఒక్క కంపెనీయే కాదు అగ్రిగోల్డ్ కు చెందిన రామా వాస్ అనే కంపెనీలో కూడ కొనసాగుతున్నాడు. అగ్రిగోల్డ్ ప్రజలకు టోపి పెడుతుందన్న ఆరోపణల మధ్య 31-7-2014లో ఈయన భూములు కొనుగోలు చేశాడు. ఈ భూములే ఆతర్వాత ప్రత్తిపాటికి తక్కువ ధరకు అమ్మాడు .  ఈయన భూములు కొనుగోలు చేసినట్లు సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఎప్పుడు కొన్నడు రిజిస్ట్రేషన్ చేసింది.  ఈయనకు అమ్మినాయన వెంకట ప్రసాద్ .కొన్నది దినకరన్. తర్వాత అగ్రిగోల్డ్ మీద కేసులు పడ్డాయి. 24-12-2014లో ఓ కేసు, 2-1-15లో ఇంకో కేసు నమోదైంది. ఆతర్వాత 4వ తేదీన అన్ని పేపర్లలో వచ్చింది.  వెస్ట్ గోదావరికి సంబంధించిన పోలీసులు అగ్రిగోల్డ్ చైర్మన్ ఇంటిమీద, హాయ్ ల్యాండ్ ప్రాపర్టీస్ మీద రైడ్ చేశారు. ఇది అన్ని పేపర్లలో వచ్చింది.  19వ తేదీ ఇదే హాయ్ లాండ్ లో ఉన్న దినకరన్ ప్రత్తిపాటి భార్య వెంకాయమ్మ పేరున తక్కువ రేటుకి భూములు అమ్మాడు.  లంచమిస్తున్నట్టుగా, తీసుకుంటున్నట్టుగా భూములు అమ్మాడు. కోల్డ్ స్కాంలో, బోఫోర్స్, స్పెక్ట్ర్ మ్ స్కాం లో ప్రతిపక్షం ఏమాట్లాడిందో తెలియదు గానీ వాటిపై సీబీఐ ఎంక్వైరీలు మాత్రం వేశారు. ఆధారాలు చూపిస్తున్నాం. సీఐడీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండే సంస్థ. అది కాకుండా హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సీబీఐ ఎంక్వైరీ జరగాలి. అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు నష్టం జరగకూడదు. ఆస్తులు అమ్మడం సజావుగా జరగాలి. డిపాజిట్ దారులు నష్టపోవద్దు. వాళ్లు ఇప్పటికే ఎక్కువగా నష్టపోయారు. ఈ గద్దల మీద ఎంక్వైరీ చేసి తీసుకున్న ఆస్తులు మళ్లీ వెనక్కితెచ్చి రీ ఎటాచ్ చేసి వేలం వేసి వచ్చిన డబ్బులను డిపాజిట్ దారులకు అందజేయాలి. వాళ్ల తరపున వాళ్ల స్వరంగా నేను మాట్లాడాలనుకున్నది ఆధారంగా చూపించాలని. రెండు రోజులు దీనిపై మాట్లాడనీయకుండా అధికార పార్టీ టైమ్ వేస్ట్ చేసిందని వైయస్ జగన్ అన్నారు. 

రుణమాఫీ అంతా బోగస్సే..
చంద్రబాబు చెబుతున్న రుణమాఫీ అంతా కూడా బోగస్సే అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. బాబు సీఎం  అయ్యే నాటికి రాష్ట్రంలో రూ.88,612 కోట్లు రైతు రుణాలు ఉన్నాయి. వీటన్నిటిని మాఫీ చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. బాబు మాటలు విని రుణాలు కట్టకపోవడంతో రైతులు సంవత్సరానికి ఏటా 16 వేల కోట్లు కడుతున్నారు. వీరేమో ఏడాదికి రూ.3 వేల కోట్లు ఇస్తే ఏమాత్రం సరిపోతాయి. కోటి 10 లక్షల ఖాతాలు ఉన్నాయి. ఒకవైపు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. మరో వైపు రైతుల రుణభారం విఫరీతంగా పెరిగిపోతోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రుణమాఫీపై అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చెప్పారు. మా పార్టీకి చెందిన ధర్మశ్రీ గురించి మంత్రి తన ప్రసంగంలో చెప్పారు. ధర్మశ్రీకి రూ.1.34 లక్షల రుణలు మాఫీ అయ్యాయని చెప్పారు. ధర్మశ్రీ వాస్తవ పరిస్థితి చెబుతున్నారు. ఆధార్‌కార్డుతో సహాభార్య పిల్లలతో ఆధారాలు చూపారు. మంత్రి పుల్లారావు చెప్పిన మాటలు అసెంబ్లీ రికార్డులో నుంచి తెచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి..ధర్మశ్రీ భార్య విజయలక్ష్మి.. ఆమె 2007లో బ్యాంకులో 49 సెంట్ల భూమి తీసుకొని రూ.35 వేలు తీసుకుంది. వడ్డీతో కలిసి రూ.70300 అయ్యిందని, వీటిని రుణమాఫీ అందింది రూ.5793 , రెండో అంశం..నాలుగు ఎకరాలు బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.27 వేలు తీసుకుంది. ధర్మశ్రీ పేరుతో బ్యాంకు లోన్‌ రూ.50 వేలు తీసుకున్నారని మంత్రి చెప్పారు. భూమి ఎంతో  చెప్పలేదు. దీనికి ఎలాంటి వడ్డీ లేదు కాబట్టి మొత్తం లోన్‌ మాఫీ అయ్యిందని చెప్పారు. రెండో కేసు..ప్రైమరీ సొసైటీ నుంచి తీసుకున్న మొత్తం రుణమాఫీ అయ్యిందని చెప్పారు. బ్యాంకు నుంచి వచ్చిన రిపోర్టు ఏంటంటే మొదటి ధపా రుణమాఫీ రూ.10 వేలు ఇచ్చారు. అసలు రూ.3900, మిగిలిన రూ.6100 వడ్డీకి సరిపోయింది. రెండో ఫేస్‌ రుణమాఫీ కింద రూ.11 వేలు ఇచ్చారు. ఇవాల్టీకి రుణం ఎంత ఉందంటే..రూ.51 వేలు ఉంది. మంత్రి మాత్రం మొత్తం మాఫీ అన్నారు. ధర్మాశ్రీ మూడో కేసు ఇలా ఉంది. ఇది ధర్మశ్రీ భార్య విజయలక్ష్మి పేరుతో కెనరా బ్యాంకులో అగ్రికల్చరల్‌ గోల్డు లోన్‌ రూ.3 లక్షలు తీసుకున్నారు. దీనికి మంత్రి ఎంతిచారంటే..రూ.14 వేలు రుణమాఫీ కింద ఇచ్చారు. ధర్మశ్రీ వడ్డీలు కట్టుకుంటు వస్తున్నా ఇవాల్టికి రూ.3 లక్షలు ఉన్నాయి. ఈ మూడు బ్యాంకులు కలిపితే రూ.4.23 లక్షలు ఉన్నాయి. వీళ్లు ఇచ్చింది రూ.41421 మాత్రమే ఇచ్చారు. అసెంబ్లీలో రూ. 1.36 లక్షలు ఇచ్చామని చెప్పారు. ఇంత గొప్పగా రుణమాఫీ కార్యక్రమం చేస్తున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు చెప్పుకుంటూ పోతున్నారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. మైక్‌ కట్‌ చేస్తున్నారు. ఇవాల్టికి కూడా రెండు గంటల సేపు టైం తీసుకొని సభలో వైయస్‌ జగన్‌ అట్టా..వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇట్టా అని అవే ఆరోపణలు చేస్తున్నారు. సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారు. అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. 

Back to Top