దుర్మార్గానికి అధికారమే లైసెన్స్‌

  • డబ్బుతో ఏమైనా చేయవచ్చు అన్న అహంకారం చంద్రబాబుది
  • బాబులా నాకు దుర్భుద్ధి లేదు
  • మూడేళ్లుగా నంద్యాలను ఎవరు పట్టించుకోలేదు
  • ఉప ఎన్నిక వచ్చిందని కేబినెట్‌ మొత్తం ఇక్కడే ఉంది
  • ఓటర్లను పట్టుకుని మీ ఓటు ఎంత అని అడుగుతున్నారు.
  • చాపిరేవులలో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం
నంద్యాల: రాష్ట్రంలో అధికారం దుర్మార్గానికి లైసెన్స్‌గా మారిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మూడో రోజు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చాపిరేవుల గ్రామంలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..మూడున్నరేళ్ల కాలంలో చంద్రబాబుకు, ఆయన కుమారుడికి, మంత్రులకు ఏ నాడు కూడా నంద్యాల గుర్తుకు రాలేదన్నారు. ఇవాళ ఉప ఎన్నిక వచ్చిందని ఏపీ కేబినెట్‌ మొత్తం నంద్యాలలోనే తిష్ట వేశారని విమర్శించారు. బాబు పాలనలో ఏ ఒక్క సమాజిక వర్గానికి కూడా న్యాయం జరగలేదు. ప్రతి సామాజిక వర్గానికి ఎరలు, బుజ్జగింపులు, బెదిరింపులు. అధికారం అన్నది దుర్మానికి లైసెన్స్‌గా మారింది. పరిపాలన పేరిట విపరీతమైన అవినీతి చేస్తున్నారు. ఈ మూడేళ్లలో ఇంతటి అన్యాయమైన, దుర్మార్గమైన పాలన చూశాం. బాబు ఎన్నికలప్పుడు హామీ ఇస్తారు. పని అయిపోయిన తరువాత మోసం చేస్తారు. అన్యాయంగా వేరే పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుంటున్నారు. ఎవరైనా నిలదీస్తే వాళ్ల మీద కేసులు పెట్టి జైళ్లలో పెట్టిస్తున్నారు. దారుణంగా పాలన సాగిస్తున్నారు. 

బాబు మోసానికి వ్యతిరేకంగా ఓటు వేద్దాం
నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు చేసిన మోసాలకు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చలేదు. మళ్లీ ఉప ఎన్నిక వచ్చే సరికి అదే టేప్‌ రికార్డు ఆన్‌ చేశారు. అవే ప్రలోభాలు, అవే మోసాలు, అవే ఎరలు. ‘‘నా వద్ద డబ్బు ఉంది దాంతో ఏమైనా చేయగలను. ఎమ్మెల్యేలను కొనగలను, ప్రజలను కొనగలను’’ అని చంద్రబాబు అంటున్నారు. ఎవరైనా కూడా నేను కొనుగోలు చేయగలను అన్న అహంకార దోరణికి చంద్రబాబు వచ్చారు. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు కూడా చంద్రబాబు చేసిన మోసానికి వ్యతిరేకంగా ఓటు వేద్దాం. అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేద్దాం. మనం వేసి ఈ ఓటు కేవలం ఒక ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు కాదు. చంద్రబాబు లాంటి వ్యక్తి మోసాలు చేస్తున్నా ప్రశ్నించకపోతే ఈ వ్యవస్థలో మార్పు రాదు. ప్రశ్నించకపోతే ఎన్నికలు అయిపోయిన తరువాత చంద్రబాబు మళ్లీ  మోసం చేస్తారు. ఇవాళ నంద్యాలలో ఓటర్ల వద్దకు వెళ్లి మీరేటెంతా అని బాహాటంగా టీడీపీ నేతలు అడుగుతున్నారు. అదే వైయస్‌ఆర్‌సీపీకి చెందిన వ్యక్తుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు.  వ్యాపారుల వద్ద డబ్బులు ఉండకూడదా? రాత్రి వైయస్‌ఆర్‌సీపీకి చెందిన రమేష్‌ అనే వ్యాపారి ఇంట్లో తలుపులు పగులగొట్టి డబ్బులు సీజ్‌ చేస్తున్నారు. చంద్రబాబు ఇంతలా దిగజారి రాజకీయాలు చేస్తున్నారు.

విశ్వసనీయతే నా ఆస్తి
చంద్రబాబు మాదిరిగా నా వద్ద అధికారం, డబ్బు, పోలీసులు, మీడియా లేదని, నాకున్న ఆస్తి ఇచ్చిన మాట నేరవేర్చగలరు అన్న విశ్వసనీయతే నా ఆస్తి అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం లాంటిది. అవసరమైనప్పుడు ప్రజలను మోసం చేసే గుణం నాకు లేదు. దుర్భుద్ధి అంతకన్న లేదు. నా వద్ద ఉన్నది ఏంటో తెలుసా? నా ఆస్తి ఏంటో తెలుసా?.. నా ఆస్తి దివంగత నేత నాన్నగారు 8 ఏళ్ల క్రితం చనిపోతు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. నాన్నగారు చనిపోయినా కూడా ఆయన చేసిన మంచి,  అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇవాల్టీ్టకి ప్రజల గుండెల్లో బతికే ఉండటం. వైయస్‌ జగన్‌ మోసం చేయడు. అబద్ధమాడడు, ఏదైనా చెబితే కచ్చితంగా చేస్తారనే విశ్వసనీయత.. అదే నా అస్తి. ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలతో పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతారన్న నమ్మకమే నా ఆస్తి. విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే నా మనస్తత్వమని గర్వంగా చెబుతున్నాను. నా పార్టీలోకి ఎవరైనా వస్తే వారి పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే అని కచ్చితంగా చెబుతున్నాను. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఆడవాళ్లకు కుట్టుమిషన్లు ఇవ్వాలని, రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలని గుర్తుకు వస్తుంది. ఎన్నికలు లేనప్పుడు సాధ్యంకాని పథకాలు, అభివృద్ధి పనులు అన్ని కూడా ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. చంద్రబాబు ఇవాళ మళ్లీ డబ్బుల మూటలతో మీ వద్దకు వస్తారు. మనసులో దేవుడ్ని ప్రార్థించి లౌక్యంగా ఓటు వేయాలని వైయస్‌ జగన్‌ సూచించారు.
Back to Top