తాజా బడ్జెట్‌లో రాయలసీమలోని ప్రాజెక్టులకు నిధులివ్వలేదు ఎందుకు?

రాయలసీమకు దశాబ్దాల నుంచి నీళ్లిచ్చేందుకు ఎస్‌ఆర్‌బీసీ ఉంది. కేసీ కెనాల్ ఉంది. తెలుగుగంగ ప్రాజెక్టు ఉంది. చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నారు. ఏ రోజూ హంద్రీ-నీవా కట్టాలన్న ఆలోచన చేయులేదు. పైగా హంద్రీ నీవాకు 40 టీఎంసీల నీరు ఎందుకు..  5.5 టీఎంసీల నీళ్లు చాలన్నారు. హంద్రీ-నీవాకు అన్ని లిఫ్టులు ఎందుకన్నారు. ఇదే బాబు హంద్రీ-నీవాకు 5.5 టీఎంసీల నీళ్లు చాలంటూ 1998 మే 6న జీవో నంబరు 68ను కూడా తీసుకొచ్చారు. దీనికి రూ.63 కోట్లు చాలన్నారు. అప్పుడు రాయులసీవు మీద ప్రేవు ఏవురుు్యంది? తాజా బడ్జెట్‌లోనూ రాయలసీమలోని ప్రాజెక్టులకు నిధులివ్వలేదు ఎందుకు? అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్నిచారు. 

రాయలసీమలోని ప్రాజెక్టులకు నిధులు కేటారుుంచని చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడి ప్రాజెక్టులకు నీళ్లిస్తావుంటూ నాటకమాడుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రాజెక్టుల్లో పెండింగ్ పనులు కళ్లవుుందు కనిపిస్తున్నా.. రాయలసీమకు నీళ్లిస్తావుంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. పట్టిసీమపై ఇచ్చిన జీవోలో ఎక్కడా రాయలసీమ పేరును చేర్చని ప్రభుత్వం... సీవుకు నీళ్లిస్తావుంటే జగన్ అడ్డుపడుతున్నారని విమర్శిస్తున్నదని ఆయున ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడుపై ఇప్పుడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమా గతంలో విజయువాడలో, ఇక్కడ ధర్నాలు చేశారని, ఇప్పుడు అదేవుంత్రి పోతిరెడ్డిపాడును పూర్తిచేసి నీళ్లిస్తావుని దొంగప్రేవు చూపిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో వైఎస్సార్ జిల్లాలో బ్రహ్మసాగర్ రిజర్వాయుర్‌లో వైఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు 12-13 టీఎంసీల నీరు నిల్వ ఉండేదని... బాబు అధికారంలోకి వచ్చి ఏడాది కాకవుుందే చుక్కనీరూ లేకుండా పోయూయుని వివుర్శించారు. ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం వుుందుకు తీసుకెళ్లి నిలదీసే కార్యక్రవుం చేపడతావుని ఆయన స్పష్టం చేశారు. రానున్నరోజుల్లో ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తావుని ప్రకటించారు. ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయున కర్నూలు జిల్లాలో పర్యటించారు.

ముందుగా ఆత్మకూరు నియోజకవర్గంలోని సిద్ధాపురం చెరువును.. అనంతరం బానకచర్ల క్రస్ట్‌గేట్లను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఆయున పరిశీలించారు. బానకచర్ల క్రస్ట్‌గేట్లను పరిశీలించాక రైతులతో వుుఖావుుఖి నిర్వహించారు. అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ‘‘ప్రాజెక్టులు కళ్లవుుందు కనబడుతున్నారుు. అరకొరగా ప్రాజెక్టులు కట్టారు. పెండింగ్ పనులు అలాగే ఉన్నారుు. ఈ ప్రాజెక్టులు పూర్తికావడం లేదు. కరువు ప్రాంతం కావడంతో నీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నారుు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం వుుందుకు తీసుకెళ్లి నిలదీసే కార్యక్రవుం చేపట్టేందుకే ప్రాజెక్టుల యూత్ర చేపట్టాం’’ అని వివరించారు. ఆయన ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే..

హంద్రీ నీవాకు ఖర్చు చేసింది రూ.13 కోట్లే..
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో హంద్రీనీవాకు కేవలం రూ.13 కోట్లే ఖర్చు చేశారు. దివంగత నేత వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుకు రూ.6,800 కోట్లు ఖర్చు చేసేందుకు నిర్ణరుుంచారు. ఆయున కాలంలో, ఆ తర్వాతి ప్రభుత్వాలకాలంలో కలపి రూ.5,800 కోట్లు ఖర్చు చేశారు. ఇంక రూ.1100 కోట్లు వెచ్చిస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. అరుుతే చంద్రబాబు ఈ బడ్జెట్‌లో కేవలం రూ.200 కోట్లు కేటారుుంచారు. ఇలా కేటారుుంపులు చేస్తే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? ప్రాజెక్టులకు నిధులు కేటారుుంచేందుకు బాబుకు వునసు రావట్లేదు. నిజంగా రాయలసీమపై ప్రేవు ఉంటే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటారుుంచాలి. పట్టిసీవులో డబ్బులు గుంజుకునేందుకు రాయలసీమపై ప్రేవు ఒలకబోస్తున్నారు.

గాలేరు-నగరికి బాబు ఇచ్చింది రూ.17 కోట్లే!
రాయలసీమలోని వురో ప్రాజెక్టు గాలేరు-నగరిపైనా చంద్రబాబుకు ఏవూత్రం ప్రేవు లేదు. తొమ్మిదేళ్ల పాలనలో గాలేరు-నగరికి రూ.17 కోట్లు కేటారుుస్తే.. వైఎస్‌ఆర్ హయాం, తర్వాతి ప్రభుత్వాల హయాంలో రూ.4,600 కోట్లు ఖర్చు చేశారు. వురో రూ.2,600 కోట్లు కేటారుుస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. అరుుతే తాజాబడ్జెట్‌లో రూ.169 కోట్లే కేటారుుంచారు. గాలేరు-నగరిలో ఎంత పెండింగ్ పనులు ఉన్నాయో చూస్తే అర్థవువుతుంది. అయినా వుంత్రి దేవినేని ఉమా... కళ్లకు గంతలు కట్టుకున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు. వుంత్రి ఇక్కడకు వచ్చి పడుకుంటానంటూ...గండికోటలో 30 టీఎంసీల నీటిని నిల్వ చేస్తానని అంటున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యమేస్తోంది. ఇంత పచ్చిగా, నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. 5-6 టీసీఎంల నీటినే నిల్వ చేసుకోలేని పరిస్థితుల్లో 30 టీఎంసీల నీటిని నిల్వ చేస్తానని.. రాయలసీమపై ప్రేవు ఉందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఒకవైపు రాయలసీమలోని ప్రాజెక్టులకు నిధులు కేటారుుంచకుండా అన్యాయుం చేస్తూ.. పైగా జగన్‌కు రాయలసీమపై ప్రేవు లేదని వివుర్శిస్తున్నారు. శ్రీశైలంలో నీటివుట్టం 803 అడుగులకు పడిపోరుుంది. ఇప్పుడు వరదలొచ్చినా శ్రీశైలంలో నీటివుట్టం 854 అడుగులకు వచ్చేదాకా రాయలసీమకు నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు.

వెలిగొండదీ అదేదారి..: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 1996లో వెలిగొండ ప్రాజెక్టును నిర్మిస్తానని బాబు టెంకాయు కొట్టారు. ఎన్నికల తర్వాత ప్రాజెక్టును గాలికొదిలేశారు. బాబు తొమ్మిదేళ్లలో కేవలం రూ.13 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఏడాదికి రూ.2 కోట్లు కూడా ఖర్చు చేయులేదన్నవూట. వైఎస్‌ఆర్ ఏకంగా రూ.3 వేల కోట్లు కేటారుుంచారు. ఇంకా రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. చంద్రబాబు బడ్జెట్‌లో కేవలం రూ.150 కోట్లు కేటారుుంచారు.

పోలవరాన్ని అడ్డుకునే కుట్ర!
బంగారంలాంటి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టే ప్రయుత్నం చేస్తోంది. పట్టిసీమ పేరుతో దారుణానికి పాల్పడుతోంది. పోలవరం నిర్మిస్తే గోదావరి వరద జలాల్ని 200 టీఎంసీల మేరకు నిల్వ చేసుకునే అవకాశముంది. ఇందులో 80 టీఎంసీలను  కృష్ణాడెల్టాకు వుళ్లిస్తే.. ఆ మేరకు నీటిని వునం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి హంద్రీ-నీవా, గాలేరు-నగరికి వుళ్లించుకుని రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు పారించుకోవచ్చు. అరుుతే ఈ పని చేయుకుండా పట్టిసీవు పేరుతో చంద్రబాబు నాటకం ఆడుతున్నారు. వాస్తవానికి గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని 7(ఈ) అని క్లాజు ఉంది. దానిప్రకారం పోలవరం పనులు మొదలుపెట్టిన వెంటనే 35 టీఎంసీల మేరకు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, వుహారాష్ట్రలు వున వాటాలో వాడుకునే అవకాశముంది. మరో క్లాజు 7(ఎఫ్) ప్రకారం.. గోదావరిపై ఏ ప్రాజెక్టు కట్టినా కర్ణాటక, వుహారాష్ర్టలు ఆ మేరకు నీటిని వుళ్లించుకునే అవకాశముంది. పట్టిసీవు వల్ల రాయలసీమలోని ప్రాజెక్టులకు రావాల్సిన నీరు రాకుండా పోతుందన్నవూట. పట్టిసీవు ప్రాజెక్టుకు కేటారుుంచే నిధులు రాయులసీవులోని ప్రాజెక్టులకు కేటారుుస్తే ఇక్కడి ప్రాజెక్టులను పూర్తిచేయువచ్చు. పట్టిసీవుకు టెండరు పిలిచినప్పుడు బోనస్ క్లాజు లేదు. పట్టిసీవుపై ఇచ్చిన జీవోలో ఎక్కడా రాయులసీవు పేరు లేదు. అరుుతే అసెంబ్లీలో ప్రతిపక్షంగా మేవుు నిలదీశాక రాయలసీమకు నీళ్లిస్తావుని అంటున్నారు.
 
వైఎస్ ఉంటే కోనసీవు వూదిరిగా అయ్యేది...! 
వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే వూ ప్రాంతం కోనసీవు వూదిరిగా అయ్యేదని బనగానపల్లె నియోజకవర్గ రైతు శివరాం సుబ్బారెడ్డి అభిప్రాయుపడ్డారు. బానకచర్ల క్రస్ట్‌గేట్ల వద్ద ఏర్పాటు చేసిన ‘రైతులతో వుుఖావుుఖీ’ కార్యక్రవుంలో ఆయున వూట్లాడారు. ‘‘బాబు సీఎంగా ఉన్నప్పుడు ఎస్‌ఆర్‌బీసీలో చుక్కనీరు పారలేదు. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక ఆయున తీసుకున్న చర్యలతో 2013 వరకూ నిరాటంకంగా నీళ్లొచ్చాయి. వుళ్లీ బాబు అధికారంలోకి వచ్చాక 2015 జనవరి వరకే నీరొచ్చింది. శ్రీశైలంలో 854 అడుగుల వరకూ నీరు తీసుకోవచ్చునని వైఎస్ జీవో తెస్తే... దానిని చంద్రబాబు 834కు తగ్గించారు. ఇప్పుడు శ్రీశైలంలో 803 అడుగులకు పడిపోరుుంది. రాయలసీమలోని ప్రాజెక్టులకు నీళ్లొచ్చే పరిస్థితి లేదు. గోరుకల్లు రిజర్వాయుర్‌లో ఐదు రకాల పనులు నిలిచిపోయూరుు. ఈ పనులను చేసేందుకు నిధులివ్వట్లేదు. ఇప్పుడు పట్టిసీవు ద్వారా సీవుకు నీళ్లిస్తావుంటే నమ్మేందుకు మేమేమైనా తిక్కోళ్లవూ? వూ చెవిలో పూలున్నాయూ?’ అని వివుర్శించారు.  కాగా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్‌ఆర్‌బీసీ ద్వారా కేవలం ఒక పంటకే నీరందుతోందని నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన రైతు రవుణారెడ్డి వాపోయూరు.
 
కాంట్రాక్టర్ చంద్రబాబు మనిషే! 
కర్నూలు: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో 70-80 శాతం పనులు పూర్తయిన హంద్రీనీవా ప్రాజెక్టుకు అవసరమైన మేరకు మిగతా నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబుకు చేతులు రావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘చంద్రబాబు, ఆయనకు చెందిన కాంట్రాక్టర్లు ఈ పనులు చేస్తున్నంత కాలం ఈ ప్రాంత ప్రజల బతుకులు ఇంతే’- అని నిప్పులు చెరిగారు. హంద్రీనీవాకు సంబంధించి మొత్తం 12 పంపులు ఆన్ చేసి నీరు ఎక్కువగా తీసుకుపోయి రైతులకు మేలు చేయొచ్చు కదా అని ఇంజనీర్లను అడిగితే ఆ స్థాయిలో పంపులు ఆన్ చేస్తే అసలు కెనాలే తెగిపోతుందని చెప్పారని అన్నారు. కెనాల్ తెగిపోతుందని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయి ఆ పనులు చేసిన కాంట్రాక్టర్ ఎవరని వాకబు చేస్తే బాబు పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అని తేలిందన్నారు. ఆయన చంద్రబాబు మనిషి కాబట్టి ఇక మన బతుకులు ఇంతే అని ఎండగట్టారు. నందికొట్కూరు సమీపంలోని మల్యాల వద్ద ఉన్న అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని రాత్రి 9 గంటల ప్రాంతంలో జగన్ పరిశీలించారు.  రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

‘వైఎస్ చలవతోనే హంద్రీనీవా తొలిదశ పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 70 నుంచి 80 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు చంద్రబాబు నిధులు కేటాయించడం లేదు. వైఎస్ చలవవల్లే అనంతపురం దాకా తీసుకుపోయాం. ఈ నీళ్లు తీసుకునిపోడానికి కరెంటు బిల్లు ఎంత అయ్యింది అని ఇంజనీర్లను అడిగాను. కరెంటు బిల్లు రూ.272 కోట్లు అయ్యిందన్నారు. రూ.272 కోట్లు కరెంటు బిల్లు అయితే అందులో రూ.50 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. మరి చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో ఎంత కేటాయించారో తెలుసా?  రూ.200 కోట్లే!. ఈ నిధులు కరెంటు బిల్లులకూ సరిపోవు. అంటే ఈ స్థాయి నుంచి హంద్రీనీవా ప్రాజెక్టును చంద్రబాబు ముందుకు తీసుకుపోరు. హంద్రీనీవాలోని అన్ని పంపులూ బాగా పని చేస్తున్నాయా అని ఇంజనీర్లను అడిగితే బ్రహ్మాండంగా చేస్తున్నాయన్నారు. ఈ ఏడాది ఎన్ని పంపులు పనిచేశాయని అడిగితే.. 4 పంపులన్నారు. మరి మిగిలిన 8 పంపులతోనూ పని చేయించి ఎక్కువ నీళ్లు తీసుకపోయి రైతులకు ఇంకా ఎక్కువ మేలు చేయవచ్చు కదా అని అడిగాను. వాస్తవం ఏమిటంటే.. మొత్తం 12 పంపులు ఆన్ చేస్తే.. ఈ కెనాల్ తెగిపోతుంది. ఆ కాంట్రాక్టరు ఎవరు అంటే..  బాబు పార్టీకి చెందిన సీఎం రమేష్. ఆ కాంట్రాక్టర్ బాబు మనిషి కాబట్టి.. మన బతుకులు ఇంతే.’
Back to Top