మానవత్వం మంటగలిపే సంఘటనలివి


విజయవాడ:  కథువా, ఉన్నావ్‌ ఘటనలపై వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మానవత్వాన్ని మంట గలిపే సంఘటలవి, దేశంలో శాంతిభద్రతలు ఆందోళనకరంగా మారాయని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి మరింత దారుణంగా మారాయన్నారు. మన బిడ్డలను కాపాడుకోవడంలో దేశంగా మనం విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. గత అక్టోబర్‌లో పట్టపగలే వైజాగ్‌లో ఘోరం జరిగిందన్నారు. రైల్వే కానీలో ఓ యువతిపై ఆకృత్యానికి పాల్పడ్డారన్నారు. డిసెంబర్‌లో పెందుర్తిలో ఓ దళిత మహిళను వివస్త్రను చేశారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు ముందు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే ..ఇక ముందు రేప్‌చేయడానికి కలలో కూడా ఎవరూ సాహసించకూడదని పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top