నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌

కృష్ణా జిల్లా: ప‌్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్నారు. జ‌ననేతకు మద్దతుగా దారులన్నీ జన ఏరులవుతున్నాయి... అన్ని వర్గాలు మేము సైతం అంటూ ప్రజాసంకల్ప యాత్రలో మమేకమవుతున్నాయి... ఓ మహోద్యమంలో భాగస్వాములవుతున్నట్టు ఆనందభరితులవుతున్నాయి.. ఆత్మ బంధువే వచ్చాడంటూ రాజన్న బిడ్డ వెన్నంటి నడుస్తున్నారు...     మా వెతలు తీర్చే నేతవంటూ జననేతకు  జేజేలు పలుకుతున్నాయి. వైయ‌స్ జ‌గ‌న్‌ 139వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను కృష్ణాజిల్లా మైలవరం శివారు నుంచి ప్రారంభించారు.  అక్కడ నుంచి చిన్న నందిగాం క్రాస్‌, వెల్వడం, గణపవరం అడ్డరోడ్‌, గణపవరం మీదగా నూజివీడు నియోజకవర్గంలోని శోభనాపురం క్రాస్‌కు చేరుకున్నారు. గ‌ణ‌ప‌వ‌రంలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 1800 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటింది. ఈ సంద‌ర్భంగా స్థానికులు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 

తాజా వీడియోలు

Back to Top