పులివెందులలో వైయస్ జగన్ పర్యటనక్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకంసమస్యలపై వినతుల స్వీకరణ
వైయస్సార్ జిల్లా(పులివెందుల): ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్‌రెడ్డి పులివెందులలో విస్తృతంగా పర్యటించారు. వైయస్ జగన్ కు పార్టీ శ్రేణులు, ప్రజలు నీరాజనం పట్టారు. రెండ్రోజుల పాటు వైయస్ జగన్ పులివెందులలో కలియతిరిగారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు కుటుంబాలను పరామర్శించి వారిలో ధైర్యం కల్పించారు. అదేవిధంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రెండో రోజు పర్యటనలో భాగంగా...ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యాంప్‌కార్యాలయంలో గడిపిన ప్రతిపక్ష నేత స్థానికుల నుంచి వినతులు స్పీకరించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులను అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు పరిష్కరించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులతో అనేక అంశాలపై చర్చించారు.