– 108 ఉద్యోగులకు జీతాలు ఉండవు..వాహనాల్లో డీజిల్ ఉండదు– 108 అంబులెన్స్ పేరుతో చంద్రబాబు స్కామ్– స్థానిక ఎమ్మెల్యే ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు– జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు– వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని బాబు హామీ ఇచ్చారు– ఎన్నికలయ్యాక రైతులను నిండా ముంచారు– బాబుతో పాటే కరువు కూడా వస్తుంది– ఉత్తమ కరవు రత్న, కుంభకర్ణుడు, సహకార ద్రోహి అవార్డు ఇవ్వాలి– చంద్రబాబు రాగానే సహకార రంగం నిర్వీర్యమవుతుంది– రాష్ట్రంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది– పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదు– ఉచితంగా బోర్లు వేయిస్తాం– రైతులకు వడ్డీలేని రుణాలు ఇప్పిస్తాం– పెట్టుబడుల కోసం ప్రతి ఏడాది రూ.12500 ఇస్తాం– ఉచితంగా బోర్లే వేయిస్తాం
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యవసాయరంగంలో ఉత్తమ అవార్డు ఇవ్వడం పట్ల తీవ్రంగా ఖండించారు. రైతులను నిండా ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రపంచంలోనే నంబర్ వన్ ఉత్తమ చీటర్ అవార్డు ఇవ్వాలని సూచించారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నారంటే..వారి మధ్య బంధం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి ప్రపంచంలో చంద్రబాబు ఒక్కరే ఉంటారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని మళ్లీ పండుగ చేస్తామని, రైతులకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం గజపతినగరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైయస్ జగన్ ఏమన్నారంటే..
– ఈ నియోజకవర్గంలోకి అడుగుపెట్టగానే రైతుల నోట్లో నుంచి వచ్చిన మాట అన్నా..ఆ తోటపల్లి ప్రాజెక్టును వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు తోమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఏ రోజు కూడా పట్టించుకోలేదన్నా..శంకుస్థాపన చేయడం, గాలికి వదిలేశారన్నా..నాన్నగారు మా జిల్లాకు వచ్చారు. ఆ తోటపల్లిప్రాజెక్టును పూర్తిచేస్తానని మాట ఇచ్చారు. మహానేత హయాంలో ఆ ప్రాజెక్టును పరుగులు పెట్టించి 90 శాతం పూర్తి చేశారు. మిగిలిపోయిన పది శాతం పనులు నాలుగేళ్లుగా పూర్తి చేయడం లేదు. ఇదే ప్రాజెక్టు అక్షరాల 20 మండలాల్లో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా ఇవాల్టికి 80 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. బ్రాంచ్ కెనాల్‌ను నాన్నగారు మంజూరు చేసి రూ.12 కోట్లు మంజూరు చేసి 20 శాతం పనులు పూర్తి చేస్తే..చంద్రబాబు నాలుగేళ్లలో కేవలం రూ.9 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ లెక్కన మాకు నీళ్లు ఎప్పుడు వస్తాయి. ఆ ప్రాజెక్టు ఫలాలు మాకు ఎప్పుడు అందుతాయని అంటున్నారు.– ఇదే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఇక్కడి ప్రజలు నా వద్దకు వచ్చి అన్న మాటలు..అన్నా గజపతినగరంలో ఉన్న ఆసుపత్రికి 100 పడకల ఆసుపత్రిని చేస్తామన్నారు. అ కథ దేవుడెరుగు అసలు డాక్టర్లే లేరు. జగన్ అనే వ్యక్తి విజయనగరంలోకి అడుగుపెట్టగానే రెండు రోజుల క్రితం గైనకాలజీని ఏర్పాటు చేసిన సిగ్గులేని ప్రభుత్వం ఇది. ఇక్కడ చిన్నపిల్లల డాక్టర్ డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారని చెబుతున్నారు. ఇక్కడ అంబులెన్స్ లేదు. బ్లెడ్ బ్యాంకు మూతపడింది. 108 పరిస్థితి పని చేయడం లేదు. ఆ రోజుల్లో 108కు ఫోన్ చేస్తే కుయ్ కుయ్ అంటూ 20 నిమిషాల్లో వచ్చేది. ప్రతి మండలానికి 108 అంబులెన్స్‌ను మహానేత గొప్పగా ఈ పథకాన్ని అమలు చేశారు. ఇదే నియోజకవర్గంలో మండలానికి 108 వాహనం ఉండాల్సి ఉండగా నియోజకవర్గంలో ఒకే ఒక వాహనం ఉంది. ఇదే నియోజకవర్గంలోని ఆండ్ర ప్రాంతానికి చెందిన గర్భిణి 108కు ఫోన్ చేస్తే..అంబులెన్స్ అందుబాటులో లేక బస్సులో ప్రయాణం చేస్తూ మెంటాడ రోడ్డుపై ప్రసవించాల్సిన ఘటన ఇదే నియోజకవర్గంలో చోటు చేసుకుందని చెబుతున్నారు. అన్నా..108 పరిస్థితి ఏంటంటే..డీజిల్‌కు డబ్బులు లేవట. ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో పెడుతున్నారు. చివరకు చంద్రబాబు మాత్రం 108లో కూడా స్కామ్‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో 310 వాహనాలు తిరుగుతుంటే..చంద్రబాబు కోర్ డ్యాష్‌బోర్డులో 414 వాహనాలు తిరుగుతున్నట్లు లెక్కలు చూపుతున్నారు. తిరుగకపోయినా తిరుగుతున్నట్లు లెక్కలు చూపించి బిల్లులు తీసుకుంటున్నారు. చంద్రబాబు 108లో స్కామ్‌లు ఏస్థాయిలో ఉన్నాయంటే..టాటా కంపెనీ రూ.12 లక్షలు 108కు కోట్ చేస్తే..చంద్రబాబు తన బినామీలకు రూ.18 లక్షల చొప్పున కట్టబెట్టి లంచాలు తీసుకుంటున్నాడు. – పక్కనే ఉన్న తెలంగాణలో రూ.11.60 లక్షలకు 108 వాహనాలు కొనుగోలు చేస్తుంటే..చంద్రబాబు మాత్రం రూ.18 లక్షలకు తన బినామీలకు కట్టబెట్టారు. ఏ స్థాయిలో లంచాలు తీసుకుంటున్నారో ఇదే నిదర్శనం– ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఫలాని చేస్తానంటే ప్రజలు నమ్ముతారు. గోస్టాని, చంపావతి నదులను అనుసంధానం చేస్తానని సాగునీరు ఇస్తానని చెప్పారు. ఇదే పెద్ద మనిషి సీఎం స్థాయిలో చెప్పిన మాటకు విలువ లేకుండా పోయింది. – గజపతినగరంలో డిగ్రీ కాలేజీ పెడతామని హామీ ఇచ్చారు. డిగ్రీ కాలేజీ కనిపించిందా? ఇదే పట్టణంలో బైపాస్ రోడ్డు కావాలని ప్రజలు అడుగుతుంటే పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే నియోజకవర్గంలో 36 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.23 కోట్లతో 2011లో పనులు ప్రారంభమ య్యాయి. ఇప్పటి వరకు ఈ పనులు నత్తనడకనా సాగుతున్నాయి.– ఇక్కడి ఎమ్మెల్యే గురించి ప్రజలు చెబుతున్నారు. అన్నా..డిగ్రీ కాలేజీ ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ఆసుపత్రి అధ్వాన్నంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇక్కడి ఎమ్మెల్యే అవినీతిలో చంద్రబాబు తర్పీదు పొందారని చెబుతున్నారు. బంగారమ్మ పేట, లోబిస గ్రామాల్లో రోడ్లు వేయకుండా వేసినట్లు బిల్లులు డ్రా చేసిన ఘనత ఈ ఎమ్మెల్యేదని చెబుతున్నారు. చంపానదిలో ఎడాపెడా ప్లొక్లైన్లు పెట్టి తోడేస్తున్నారు.– ఇసుక ఫ్రీగా ఇస్తున్నామని చంద్రబాబు అంటున్నారు. వస్తుందా? లేదు..చంద్రబాబు బినామీలకే ఇసుక ఉచితంగా అందుతోంది. అంగన్‌వాడీ, ఫీల్డ్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ పోస్టులను అమ్ముకుంటున్నారని ఇక్కడి ఎమ్మెల్యే గురించి చెబుతున్నారు. – గడిచిన జూన్ నుంచి ఇవాల్టి వరకు జిల్లాలో 34 మండలాల్లో 32 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అయిందని చెబుతున్నారు. అందులో 16 మండలాలు అన్యాయమైన స్థాయిలో మైనస్ 20 శాతం వర్షపాతం నమోదు అయినా కరువు మండలాలుగా ప్రకటించలేదు. కనీసం దమ్మిడిసాయం కూడా అందించలేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. – జిల్లాలో 32 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అయినా పట్టించుకోని పెద్దమనిషి..ఈ ఏడాది బాబుకు అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం ఇస్తున్నట్లు పేపర్‌లో చదివాను. ఇదే విషయాన్ని చంద్రబాబుకు సంబంధించిన ఆయన ఎల్లోమీడియా గట్టిగా ఊదరగొడుతూ చూపించింది. చంద్రబాబుకు ఈ పురస్కారం ఇచ్చేది ఎవరో తెలుసా..బీజేపీకి చెందిన రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా అందుకోబోతున్నాడట. ఇదే రాజ్‌నాథ్‌సింగ్ పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు ఎప్పటికీ మా మిత్రుడే అన్నారు. ఇప్పుడు ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోవడం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాగి వచ్చి రోజు భార్యను కొట్టే భర్తకు ఉత్తమ భర్త అవార్డు ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చంద్రబాబు వ్యవసాయ రంగంలో అవార్డు ఇచ్చినట్లుగా దారుణంగా ఉంది. – ఏపీలో నంబర్ వన్ రైతు వ్యతిరేకి చంద్రబాబే. వ్యవసాయం దండుగా అన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టాలు ఆరబేసుకోవాలి అన్నారు. సబ్సిడీలు అన్నది పులి మీద సవారీ అన్నట్లుగా ఉందన్న వ్యక్తికి వ్యవసాయంలో అవార్డు ఇస్తున్నారంటే అవహేళన చేసినట్లు కాదా?– దేశంలో నదులు అనుసంధానం చేసిన మొదటి సీఎం నేనే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన పోలవరం కుడికాల్వలో చెంబు నీళ్లు పోస్తే అనుసంధానం చేసినట్లా? చంద్రబాబు హయాంలో జరిగిన వ్యవసాయ అభివృద్ధి ఎందో చూస్తే..ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదు. ఒక్కటన్ను కూడా అదనంగా పండలేదు. పదేళ్ల క్రితం వైయస్‌ఆర్ హయాంతో పోలిస్తే దిగుబడి తగ్గిపోయింది. 2008–2009లో వైయస్‌ఆర్ హయంలో సాగు విస్తిర్ణం పెరిగితే చంద్రబాబు హయాంలో సాగు విస్తిర్ణం పడిపోయింది. ఇటువంటి వ్యక్తికి అవార్డు ఇస్తున్నారు. ఇలాంటి అవినీతి, అన్యాయాలు చేస్తున్న వ్యక్తికి ఎలాంటి అవార్డు ఇవ్వాలో ఆలోచించండి. జనాభా పెరుగుతున్నా..ఆహార ధాన్యాల ఉత్పత్తులు వైయస్‌ఆర్ హయంతో చూస్తే పది శాతం తగ్గింది. చంద్రబాబు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికలప్పుడు మాట ఇచ్చి..సీఎ అయ్యాక మాట తప్పారు. దారుణంగా మోసం చేస్తున్న వ్యక్తికి ప్రపంచంలోనే నంబర్ వన్ చీటర్ అవార్డు ఇవ్వాలి.– నాబార్డు సంస్థ ఇచ్చిన నివేదిక పరిశీలిస్తే..దేశంలోనే 29 రాష్ట్రాల్లో అట్టడుగునా 28వ స్థానంలో ఉంది. అప్పుల్లో రెండో స్థానంలో ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రికి ఏ అవార్డు ఇచ్చినా తక్కువ కాదా? చంద్రబాబు హయాంలో క్వింటాల్ ధాన్యం రూ.1100 చొప్పున కొంటున్నారు. అదే హెరిటేజ్ షాపుల్లో కేజీ రూ.46 చొప్పున అమ్ముతున్నారు. ఉల్లి కేజీ రూ.20 చొప్పున అమ్ముతున్నారు. రైతుల వద్ద కంది రూ.3500 క్వింటాల్ చొప్పున కొంటున్నారు. రూ.7700 చొప్పున హెరిటేజ్‌లో అమ్ముతున్నారు. ప్రపంచంలోనే అతి ఉత్తమ దళారీ అవార్డు ఇవ్వాలి. రైతులకు తోడుగా నిలబడాల్సింది పోయి నిండా ముంచారు. – చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన వెంటే కరువు వస్తుంది. అందుకే చంద్రబాబుకు ఉత్తమ కరువు రత్న అవార్డు ఇవ్వవచ్చు. కరువు వచ్చినప్పుడు రైతులను ఆదుకోకుండా చంద్రబాబు కుంభకర్ణుడిగా నిద్రపోతున్నారు. దగ్గరుండి సహకార రంగంలో ఉన్న ఫ్యాక్టరీలను మూత వేయిస్తున్నారు. అందుకే ఆయనకు ఉత్తమ సహకార రంగ ద్రోహీ అవార్డు ఇవ్వవచ్చు. – వారం రోజులుగా మున్సిపాలిటీల్లో ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తోంది. రాష్ట్రమంతా విష జ్వరాలు..చెత్త పాలన అందిస్తున్న చెత్త ముఖ్యమంత్రికి ఉత్తమ చెత్త సీఎం అవార్డు ఇవ్వాలని మీ అందరి తరఫున రెకమెండ్ చేస్తున్నాను.– నాలుగేళ్ల చంద్రబాబు పరిపాలన చూశారు. రైతులకు ఏమాత్రం మేలు జరుగలేదు. ఉద్యోగాల కథ దేవుడెరుగు..ఉన్న ఉద్యోగాలను ఊడబెరకుతున్నారు. సాక్షారభారతి ఉద్యోగులు నా వద్దకు వచ్చారు. దాదాపుగా 20 వేల మంది ఉన్నారు. 13 నెలలుగా వారికి జీతాలు ఇవ్వకుండా రోడ్డున నిలబెట్టారు. నాలుగున్నరేళ్ల పాలనలో మోసం, అబద్ధాలు, అవినీతి, అధర్మం చూశాం. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఒక్కసారి మీ గుండెలపై చేతులు వేసుకోని ఆలోచన చేయండి. మీకు అబద్ధాలు చెప్పేవారు నాయకులు కావాలా? మోసం చేసేవారు నాయకులు కావాలా? ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ రావాలి. ఏదైనా నాయకుడు ఫలానిది చేస్తానని ఎన్నికల ప్రణాళికలో చేర్చి ఓట్లు వేయించుకొని అ«ధికారంలోకి వచ్చినే తరువాత చెప్పింది చేయకపోతే ఆ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడు మార్పు వస్తుంది. ఈ చెడిపోయిన వ్యవస్థను మార్చాలంటే జగన్‌కు మీ అందరి తోడు, ఆశీస్సులు కావాలి. అప్పుడు ఈ వ్యవస్థ మారే అవకాశం ఉంటుంది. ఇటువంటి అన్యాయమైన పాలన పోయి దేవుడి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ఇందులోని అన్ని అంశాలను ఒకే మీటింగ్‌లో చెబితే సమయం సరిపోదు కాబట్టి.. ఒక అంశం మాత్రమే చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఏం చేస్తామన్నది చెబుతున్నాను. రైతులను ఆదుకునేందుకు వైయస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెడతాం. రైతులకు పెట్టుబడుల కోసం ఏటా రూ.12500 ఇచ్చి తోడుగా ఉంటాం. వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. పగటి పూట ఉచితంగా 9 గంటల కరెంటు ఇస్తాం. ఉచితంగా బోర్లు వేయిస్తాం, ప్రతి మండలంలో కోల్డు స్టోరేజీ గోడౌన్లు ఏర్పాటు చేస్తాం. పాడీ రైతులను ఆదుకుంటాం. ప్రతి లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకంగా అందజేస్తాం. కరువు వచ్చినా, అతివృష్టి, అనావృష్టి నుంచి తోడుగా ఉండేందుకు ప్రకృతి వైఫరీత్యాల కింద రూ.4 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం. మద్దతు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ఇందులో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. వైయస్‌ఆర్ భరోసా పథకంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు తోడుగా ఉంటాం. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని పేరు పేరున కోరుతూ హృదయపూర్వకంగా మరోసారి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నా..