ప్రొద్దుటూరు అభివృద్ధికి హామీ

వైయస్ఆర్ జిల్లాః చంద్రబాబు మోసపూరిత పాలన వల్ల రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గం అన్యాయానికి గురైందని వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు. 5వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రొద్దుటూరుకు చేరిన సందర్భంగా పుట్టపర్తి సర్కిల్ లో ప్రజలనుద్దేశించి భారీ బహిరంగసభలో ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.....

 నాలుగేళ్ల టీడీపీ పాలన చూశాక ప్రొద్దుటూరును చూస్తే బాధనిపిస్తుంది. నాన్నగారు దివంగత  ముఖ్యమత్రి వైయస్ రాజశేఖరరెడ్డి 
ఐదేళ్ల 3 నెలల పాలనలో ప్రొద్దుటూరుకు పశువైద్యశాల, యోగివేమన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ,  ఔటర్ రింగ్ రోడ్డు, చేనేతల కోసం అబ్ నార్మల్ పార్కుకు 53 ఎకరాలు ఏది చూసినా దివంగత నేత కన్పిస్తాడు. ప్రొద్దుటూరుకు తాగునీటి సమస్య తీర్చాలని వరద కాలువ నీళ్లు ఇక్కడకు తీసుకురావాలని 73కోట్లు కేటాయింపులు చేస్తే ఇవాళ్టికి కూడ ఆవరద కాలువ నుంచి నీరు తీసుకురాలేని పరిస్థితుల్లో పాలన సాగుతుంటే బాధనిపిస్తోంది. ఇదే ప్రొద్దుటూరు నగరానికి  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొని రావాలని నాన్నగారు ఆ రోజుల్లో36కోట్లు శాంక్షన్ చేస్తే ఇవాళ్టికి కూడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మొదలుపెట్టని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే బాధనిపిస్తోంది. 

నాన్నగారు మన మధ్యనుంచి దూరమయ్యాక మొండిగోడల్లా ఉన్న ప్రాజెక్ట్ ను చూస్తే బాధనిపిస్తోంది. గండికోట సామర్థ్యం 28 టీఎంసీల కెపాసిటీ. సర్వారాయ సాగర్ కెపాసిటీ 3 టీఎంసీలు, వాగుకొండ మరో టీఎంసీ. చిత్రావతి, పైడిపాలం ఈ ప్రాజెక్ట్ లన్నీ చూసినప్పుడు బాధనిపిస్తోంది. శ్రీశైలంలో నిండుగా నీళ్లున్నా  ఈప్రాజెక్ట్ లకు నీళ్లివ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం బాధాకరం. నాన్నగారు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44వేల క్యూసెక్కుల డిశ్చార్జ్ తీసుకొని రావాలని, ప్రాజెక్ట్ లన్నీ కళకళలాడుతూ ఉండాలని పరితపించారు. గండికోట మొదలు సర్వరాయసాగర్ సహా  అన్ని ప్రాజెక్ట్ లు వైయస్ఆర్ హయాంలో 90శాతం పూర్తయ్యాయి. మిగిలిపోయిన కొద్దిపాటి పనులు ఇవాళ్టికి పూర్తి చేయలేని అధ్వాన్నపాలన చూస్తే బాధనిపిస్తోంది. శ్రీశైలంలో నీళ్లు ఉన్నా వరద కాలువ పూర్తి కానిపరిస్థితుల్లో నీళ్లు పట్టుకోలేకపోతున్నాం. 

బాబుకు ఎన్నికలప్పుడు మాత్రమే వాగ్ధానాలు గుర్తుకు వస్తయి. ప్రజలను మోసం చేసేందుకు మాటలు చెబుతడు. ఎన్నికలప్పుడు ఆయన అన్న మాటలేమిటి. టీవీల్లో ఏ ప్రకటన చూసినా,  బాబు మైక్ పట్టుకొని మాట్లాడినప్పుడల్లా అన్నమాటలేమిటి. 87, 612కోట్లు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కావాలన్నా, బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలన్నా  బాబు ముఖ్యమంత్రి కావాలన్నడు.  నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా. ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యాయా, బ్యాంకుల్లో బంగారం ఇంటికొచ్చిందా అని అడుగుతున్నా. చంద్రబాబు రుణమాఫీ పథకం వడ్డీలకు కూడ సరిపోని పరిస్థితుల్లో రైతులు అపరాధ వడ్డీలు కడుతున్న పరిస్థితి. 

ఆడవాళ్లని కూడ చూడకుండా మోసం చేశాడు. డ్వాక్రా సంఘాలను నేనే కనిపెట్టా అన్నాడు. పొదుపు సంఘాల రుణాలన్నీ 
మాఫీ కావాలంటే బాబు రావాలి అన్నాడు. నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా. ఒక్క రూపాయైనా మాఫీ అయిందా అని అడుగుతున్నా. 
ఒక్క రూపాయి కూడ మాఫీ కాలేదు.  రైతులను, అక్కచెల్లెమ్మలను, చివరకు చదువుకునే పిల్లలను కూడ వదల్లేదు. జాబు రావాలంటే బాబు రావాలి అన్నాడు. జాబు ఇవ్వకపోతే రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నడు. రాష్ట్రంలో కోటి 75 లక్షల ఇళ్లున్నాయి.  45నెలల్లో ప్రతి ఇంటికి బాబు రూ.90వేలు బాకీ పడ్డాడు. 


 బాబు ముఖ్యమంత్రి అయ్యాక కడపకు వచ్చినప్పుడు ఇచ్చిన మాటలేమిటి..? కడపలో స్టీల్ ప్లాంట్, సిమెంట్ కంపెనీ, పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఫుడ్ పార్కు, ఉర్దూ యూనివర్సిటీ, గార్మెంట్ క్లస్టర్, ఉద్యానవన యూనివర్సిటీ ఎక్కడైనా కనిపించాయా..? అని అడుగుతున్నా ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పిన మాటలివి. ఇలాంటి మోసపూరిత రాజకీయ వ్యవస్థను నాలుగేళ్లుగా చూస్తున్నాం. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. చెప్పింది చేస్తారన్న నమ్మకం విశ్వసనీయత ఉంటేనే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది.

బాబు పాలనలో రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి.  బాబు వల్ల తమకు అన్యాయం జరిగిందని ప్రతి సామాజిక వర్గం చెబుతోంది.  ముందు మంచి రోజులున్నాయని,  రేపటి మీద భరోసా ఇచ్చేందుకు ప్రతి సామాజిక వర్గాన్ని కలుస్తూ, ప్రతి ప్రాంతం పాదయాత్రగా తిరుగుతున్నా. మీరు చెప్పే ఆలోచన వింటూ ముందుకు సాగుతున్నా.  3 వేలకి.మీ. పాదయాత్ర తర్వాత మనం తీసుకొచ్చే మేనిఫెస్టో బాబుమాదిరి ఇంతింత బుక్ లుండవు. మన మేనిఫెస్టో 2, 3పేజీలుంటుంది. ప్రతి అంశం ప్రజలే దిద్దుతారు. ప్రజల ఆలోచనలతో మేనిఫెస్టో తెచ్చి చేశామని చూపిస్తాం. బాబు మేనిఫెస్టో ఎక్కడుందని వెతికితే ఎక్కడ కనిపించదు. కారణమేమిటో తెలుసా..? కనిపిస్తే ప్రజలందరూ బాబును కొడతారని భయం. 

మనం అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో చెప్పినవే కాదు చెప్పనివి కూడ చేసి చూపిస్తాం. విశ్వసనీయతతో కూడి రాజకీయాలు చేసి ప్రతి అంశాన్ని పూర్తి చేశాం, మళ్లీ 2024లో ఆశీర్వదించమని మీ ముందుకు వస్తాను. ఈ ప్రయత్నంలో మీ అందరూ దారి పొడవునా ఆశీర్వదించండి. సలహాలివ్వండి. మీరు చెప్పే సలహాలన్నీ తీసుకొని ఎన్నికల ముందు మేనిఫెస్టో డిక్లేర్ చేస్తాను. నవరత్నాల్లో మార్పులు చేయాల్సి వస్తే ఆ సలహాలు కూడ తీసుకొని చేస్తాను. మీరందరూ ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. నాన్నచనిపోయాక ప్రొద్దుటూరుకు రెండు ప్రధానమైనవి పెండింగ్ లున్నాయి. ప్రొద్దుటూరుకు నీళ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేసి చూపిస్తానని హామీ ఇస్తున్నా. 

తాజా వీడియోలు

Back to Top