వ్యవసాయ విద్యార్థులకు గ్రామ సచివాలయాల్లో ఉద్యోగ ప్రాధాన్యత
శ్రీకాకుళంః నైరా ఎన్‌.జి.రంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వైయస్‌ జగన్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం ఇచ్చారు.వైయస్‌ జగన్‌ నేలపై మట్టిపై కూర్చొని తమ సమస్యలు వివరం గా అడిగి తెలుసుకున్నారని విద్యార్థులు తెలిపారు. ప్రైవేట్‌ అగ్రికల్చర్‌ కాలేజీలకు అనుమతి ఇవ్వడం వల్ల నాణ్యమైన విద్య అందించలేరని  విద్యార్థులు తెలిపారు.పదేళ్లుగా వ్యవసాయ అధికారుల పోస్టులను భర్తీ చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2012లో మాత్రమే ఎఇవో,ఎవో పోస్టులు భర్తీ చేశారని..నేటివరుకు ఒక పోస్టు కూడా నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు.వ్యవసాయ రంగాన్ని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ విద్యార్థులకు ఉద్యోగ ప్రాధాన్యత ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 


Back to Top