జ‌న‌హోరు

- తిమ్మ‌స‌ముద్రం వ‌ద్ద ముగిసిన 72వ రోజు  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
నెల్లూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ గ్రామాన ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. శ‌నివారం నిర్వ‌హించిన పాద‌యాత్ర‌కు జ‌నం పోటెత్తారు. వేలాది మంది రాజ‌న్న బిడ్డ‌తో క‌లిసి న‌డిచారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 72వ రోజు పాద‌యాత్ర నెల్లూరు జిల్లా గూడురు నియోజ‌క‌వ‌ర్గంలోని తిమ్మ‌స‌ముద్రం వ‌ద్ద ముగిసింది. శనివారం ఉద‌యం సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం చిలమానుచేను క్రాస్‌రోడ్డు నుంచి వైయ‌స్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్క‌డి నుంచి గుర్రంకొండకు చేరుకొని దివంగత మహానేత వైయ‌స్ఆర్‌  విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటు నుంచి ఆర్మేనుపాడు చేరుకున్న ఆయనకు ప్రజలు, మహిళలు పెద్దసంఖ్యలో ఘనస్వాగతం పలికారు. ఆర్మేనుపాడులో వైయ‌స్‌ జగన్‌ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం భోజన విరామం తర్వాత కాండ్ర గ్రామం దగ్గర గూడూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టనుంది. అక్కడి నుంచి వెంకటేశుపల్లి మీదుగా తిమ్మసముద్రం క్రాస్ రోడ్డు వరకు వైయ‌స్ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర సాగింది.

తాజా ఫోటోలు

Back to Top