36వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభంఅనంతపురం :  ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శనివారానికి 36వ రోజుకి చేరుకుంది. ఇవాళ  ఉదయం అనంత‌పురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం చిగిచెర్ల నుంచి జ‌న‌నేత‌ పాదయాత్రను ప్రారంభించారు. అక్క‌డి నుంచి వసంతపురం, గరుడంపల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. బాదన్నపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు మల్కాపురం క్రాస్‌ చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండా ఎగురవేస్తారు. తర్వాత గొట్లూరు మీదుగా సాయంత్రం 5.30కు ధర్మవరం క్రాస్‌ రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగించి వైయ‌స్‌ జగన్‌ రాత్రి అక్కడే బస చేస్తారు.


 
Back to Top