పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్..!

పులివెందులః ఏపీ  ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి సాధకబాధలు అడిగి తెలుసుకుంటున్నారు. రెండ్రోజులుగా  వైఎస్సార్ జిల్లా పులివెందులలో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న పైడిపాలెం ప్రాజెక్ట్ ను వైఎస్ జగన్ సందర్శించారు. ప్రాజెక్ట్ ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. రెండో రోజు పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు. తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాసమస్యలపై నిర్వహించిన ప్రజాదర్బార్ లో పాల్గొని వినతులు స్వీకరించారు. 

అదేవిధంగా పులివెందుల  మండలం ఇ.కొత్తపల్లె పంచాయితీ పరిధిలోని మొట్నూతలపల్లెలో ..ఆత్మహత్య చేసుకున్న రైతు రాజశేఖర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. పంటంతా ఎండిపోయి తీవ్రంగా నష్టపోవడంతో....అప్పుల బాధతాళలేక గతనెల 19 వ తేదీన రాజశేఖర్  పొలం వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ జగన్ వారి కుటుంబసభ్యులను ఓదార్చి వారిలో ధైర్యం నింపారు.  

Back to Top