- ప్రజాస్వామ్యన్ని తుంగలో తొక్కుతున్న చంద్రబాబు
- రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా..?
- ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే సత్తా నీకుందా..?
- ప్రజలే ప్రతిపక్షంగా తయారై బాబుకు బుద్ధిచెబుతారు
- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
గుంటూరుః ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తే... రాష్ట్ర ప్రజలంతా వైయస్ జగన్‌కు మద్దతుగా ప్రతిపక్షంగా తయారై మీకు తగిన గుణపాఠం చెబుతారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చంద్రబాబును హెచ్చరించారు. పకృతి వైపరిత్యాలకు ఓర్చి అష్టకష్టాలు పడి రైతులు పంటలు పండిస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం దుర్మార్గమని మేకపాటి అన్నారు. రైతులను కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేందుకు వైయస్ఆర్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుదీక్ష చేస్తున్నారని స్పష్టం చేశారు. దీక్ష ద్వారా రైతులను ఆదుకోవాల్సింది పోయి చంద్రబాబు తన క్యాబినెట్ మంత్రులతో పోకిరి మాటలు పలికిస్తున్నారని మండిపడ్డారు. ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మీపై లేదా అని చంద్రబాబును నిలదీశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలనే కుట్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజాక్షేమం కోసం పనిచేయడం లేదన్నారు. దీన్ని ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలంటే చంద్రబాబుకు లెక్కలేకుండా పోయిందని మేకపాటి విమర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నేతలను తీసుకుంటే తీసుకున్నారు కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయగల సత్తా చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలంతా ప్రతిపక్షంగా తయారై మిమ్మల్ని ఓడిస్తారని హెచ్చరించారు.
దమ్మున్న నాయకుడు వైయస్ జగన్
ప్రతిపక్షనేత వైయస్ జగన్ చేసిన సాహసం మీరు చేయగలరా అని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. తన తండ్రి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీని ఎదిరించి బయటకు వచ్చిన దమ్మున్న నాయకుడు వైయస్ జగన్ అని స్పష్టం చేశారు. సోనియాగాంధీ అష్టకష్టాలు పెడుతుందని తెలిసినా కూడా బయటకు వచ్చి సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకొని కొద్ది సమయంలోనే ప్రతిపక్షనేతగా ఎదిగాడని చెప్పారు. చంద్రబాబూ.. మీరు అన్నింట్లో రాజీ పడడమే కదా.. అటువంటి పరిస్థిత్తుల్లో ప్రజాస్వామ్య విలువలను ఏ విధంగా కాపడుతారని చురకంటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలంతా ఏకమై ప్రజాస్వామ్య వ్యతిరేకి చంద్రబాబుకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.