వైయస్ఆర్ ఆశయ సాధన కోసమే జననేత పాదయాత్ర

తొండంగి (తుని): పేద, బడుగు వర్గాల ప్రజల ఆర్థిక ఇబ్బందులను తొలగించి సుభిక్షమైన పాలన అందించాలన్న దివంగత వైయస్సార్‌ ఆశయ సాధనే కోసమే జగన్‌ పాదయాత్రను ప్రారంభించారని వైయస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జగన్‌ పాదయాత్ర విజయవంతం కావాలని పార్టీ యువజన విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, మండల కన్వీనర్‌ బత్తుల వీరబాబు, మేరుడు అనందహరి, ఇతర నాయకులందరూ కలిసి తీరప్రాంతం బీచ్‌రోడ్డులో బైక్‌ ర్యాలీ నిర్వహించడంతోపాటు ముసలయ్యపేట, యర్రయ్యపేట, కొత్తపేట, ఎల్లయ్యపేట గ్రామ దేవతలకు పూజలు చేయడంతోపాటు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పంపోదమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

108 కొబ్బరి కాయలు కొట్టారు. పార్టీ నాయకులు మాకినీడి గాంధీ ఈసందర్బంగా మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం అందించి సుభిక్షమైన పాలన అందించాలన్న వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలను సాధించడమే అంతిమ లక్ష్యంగా జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో ముసలయ్యపేటకు చెందిన పార్టీ నాయకులు ఎంపీటీసీ సభ్యుడు దూలం నూకరాజు, దూలం బాబూరావు, తాటిపర్తి శ్రీను, తాటిపర్తి గుర్రయ్య, నేమాల సత్తిబాబు, దూలం మంగబాబు, ఎల్లయ్యపేట సింగిరి సింగరం, గంపల దండు, బద్ది దండు, తదితరులు పాల్గొన్నారు.
Back to Top