500 కిలోమీటర్ల మైలు రాయి దాటిన వైయస్‌ జగన్‌

 

అనంతపురం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 500 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఉట్లూరు గ్రామంలోకి చేరగానే 500 కిలోమీటర్లు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా మహిళలు రంగు రంగుల ముగ్గులు వేసి, పూలతో అందంగా అలంకరించి జననేతకు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 500 మైలు రాయి వద్ద వైయస్‌ జగన్‌ మొక్కను నాటారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలు ఓపికతో వింటున్న అధినేతను అభినందిస్తున్నారు.
 
Back to Top