తూర్పు గోదావరి: జగ్గంపేట, పిఠాపురం బహిరంగ సభల్లో వైయస్ జగన్ ఇచ్చిన హామీలపై కాపు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర 227వ రోజు ప్రారంభ సమయంలో గురువారం ఉదయం కాపు మహిళలు జననేతను కలిసి పుష్పగుచ్చాలు అందించి, శాలువాలతో సత్కరించారు. వైయస్ జగన్ ఇచ్చిన హామీలను టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వక్రీకరించిందని కాపు మహిళలు మండిపడ్డారు. వైయస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారన్న నమ్మకం తమకు ఉందని కాపు మహిళలు విశ్వాసం వ్యక్తం చేశారు. కాకినాడ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ చంద్రకళ మాట్లాడుతూ..కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఇస్తామని వైయస్ జగన్ ప్రకటన చేయడం హర్షనీయమన్నారు. చంద్రబాబు మాదిరిగా వైయస్ జగన్ ఎన్నికలకు ముందు ఒక మాట..ఎన్నికల తరువాత మరోమాట చెప్పే నాయకుడు కాదన్నారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతారని నమ్ముతున్నారని చెప్పారు. రాబోయే కాలంలో జగనన్నకు అంతా మంచి జరగాలని, ఆయన ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నట్లు చెప్పారు.