శ్రీకాకుళం: అమరజీవి పొట్టి శ్రీరాములుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులుర్పించారు. నేడు పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన రోజు కావడంతో ఆయన చిత్రపటానికి వైయస్ జగన్ పూలమాల వేసి అంజలి ఘటించారు. అమరజీవి సేవలను ఈ సందర్భంగా జననేత గుర్తు చేసుకున్నారు. అనంతరం 321వ రోజు ప్రజా సంకల్ప యాత్రను శ్రీకాకుళం జిల్లా అలికం క్రాస్ నుంచి వైయస్ జగన్ ప్రారంభించారు.