కేంద్రంపై అవిశ్వాసం పెట్టాం

 
 
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు మడమతిప్పని పోరాటం చేస్తున్న జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సమరశంఖం పూరిం​చారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలతో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టించారు. ఇదే విషయాన్ని ట్విటర్‌ ద్వారా వైయ‌స్‌ జగన్‌ వెల్లడించారు.

‘కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామ’ని వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. అవిశ్వాస తీర్మానం కోసం ఇచ్చిన నోటీసును కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు ఆయన స్వయంగా లేఖలు కూడా రాశారు. ఈ లేఖలను ఎంపీలు ఢిల్లీలో పలు రాజకీయ పార్టీల నాయకులను కలిసి అందజేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం తమతో కలిసి రావాలని వివిధ రాజకీయ పార్టీలకు వైయ‌స్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

Back to Top