వీళ్ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌కండి




- ఏపీపై పెద్ద‌ల‌కు ఉన్న ప్రేమ‌ను చూస్తే బాధ‌నిపించింది
- ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు ప్ర‌ధానికి గుర్తు లేవా? 
- చంద్ర‌బాబు ఆమోదంతోనే హోదాకు బ‌దులు ప్యాకేజీ ఇచ్చామ‌ని మోదీ చెప్పారు
- రాహుల్ ప్ర‌స్తావ‌న‌లో ఏపీ గురించి అర నిమిషం కూడా లేదు
- హోదాకు రాయితీల‌కు సంబంధం లేద‌ని టీడీపీ మ‌హానాడులో తీర్మానం చేశారు
- హోదాను ప‌క్క‌న పెట్టి ఏపీ హ‌క్కును తాక‌ట్టు పెట్టే అధికారం వీరికి ఎవ‌రిచ్చారు?
- నాలుగేళ్లుగా మేం చెబుతుంటే వెక్కిరించారు
- టీడీపీ ఎంపీలు మొత్తం రాజీనామా చేయండి
- జులై 24న ఏపీ బంద్‌కు వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు
- స‌హ‌క‌రించాల‌ని అంద‌రికీ విజ్ఞ‌ప్తి
తూర్పు గోదావ‌రి:  రాష్ట్రాన్ని అన్యాయంగా విడ‌గొట్టిన కాంగ్రెస్‌ను, హోదా ఇస్తామ‌ని మోసం చేసిన బీజేపీని, ఏపీ ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను తాక‌ట్టు పెట్టిన చంద్ర‌బాబును ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా మేం ప్ర‌త్యేక హోదాపై పోరాడితే నీరుగార్చిన చంద్ర‌బాబు ఆరు నెల‌ల్లో ఎన్నిక‌లు ఉన్నాయ‌ని డ్రామాలాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌త్యేక హోదా అంశంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఏ పార్టీ కూడా ఏపీకి జ‌రిగిన అన్యాయం గురించి మాట్లాడలేద‌ని, ఎవ‌రి అజెండా వారికి ఉంద‌న్నారు. ప్ర‌త్యేక హోదాపై మా నిజాయితీ న‌రేంద్ర‌మోడీకి ట్రాప్‌లా ఉందా అని సూటిగా ప్ర‌శ్నించారు.  ఏపీకి జ‌రిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు అంద‌రూ రాజీనామా చేసి నిరాహార దీక్ష‌కు కూర్చోవాల‌ని, చంద్ర‌బాబుపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 24న ఆంధ్ర‌ప్ర‌దేశ్ బంద్‌కు వైయ‌స్ జ‌గ‌న్ పిలుపునిచ్చారు. నిన్న పార్ల‌మెంట్‌లో జ‌రిగిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌పై వైయ‌స్ జ‌గ‌న్ శ‌నివారం కాకినాడ‌లో మీడియాతో మాట్లాడారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..వైయ‌స్ జ‌గ‌న్ మాట‌ల్లోనే..

బీజేపీ నుంచి కాంగ్రెస్ వ‌ర‌కు దాకా మిగిలిన ఏ పార్టీలు కూడా ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తిస్తు మాట్లాడ‌లేదు. నిజంగా ఇది అన్నింటిక‌న్నా బాధాక‌ర‌మైన విష‌యం. పార్ల‌మెంట్ సాక్షిగా చేస్తూ ఏపీ న‌ష్ట‌పోయింద‌ని ఆరోజు అధికార ప‌క్షం, ప్ర‌తిప‌క్షం, చంద్ర‌బాబు క‌లిసి రాష్ట్రాన్ని విడ‌గొట్టారు. ఇటువంటి నేప‌థ్యంలో నిన్న దాదాపు నాలుగేళ్లు పైగా ఏపీకి ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోగా, నిన్న చ‌ర్చ‌లో క‌నీసం ఎవ‌రు మాట్లాడ‌లేదు. 
-ఎన్నిక‌ల ప్ర‌ణాలిక‌లో బీజేపీ  ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని చెప్పారు. ఇవ్వాల్సిన బాధ్య‌త మాదే అన్న మాట మోడీ నోటి నుంచి రాలేదు. సాక్ష్యాత్తు తిరుప‌తి స‌భ‌లో తానే ప్ర‌త్యేక హోదాను ప‌దేళ్లు ఇస్తామ‌న్న మాట‌లు గుర్తుకు రాలేదు. ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో బీజేపీ ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదు.ప్ర‌ధానికి ఇవేవిగుర్తుకు రాక‌పోగా, తాను చెప్పిన మాట‌ల్లో ఇంకా బాధ క‌లిగించే మాట‌లు ఏంటంటే..చంద్ర‌బాబుతో ఫోన్‌లో మాట్లాడి..హోదాకు బ‌దులు ప్యాకేజీ ఇచ్చామ‌ని చెప్పారు. హోదాకు బ‌దులు ప్యాకేజీ చాలు అని చెప్ప‌డానికి చంద్ర‌బాబు ఎవ‌రు? ఆయ‌న‌కు ఆ హ‌క్కు ఎవ‌రిచ్చారు. ఐదు కోట్ల మంది పిల్ల‌లు ఇవాళ ఉద్యోగాలు లేక వ‌ల‌స బాట ప‌డుతున్నారు. అటువంటి ప‌రిస్థితిలో ఏపీ ఉంటే..ప్ర‌త్యేక హోదా ఉన్న రాష్ట్రాల‌కే ప‌రిశ్ర‌మ‌లు, ఆసుప‌త్రులు క‌ట్టే వారికి ఇన్‌కంట్యాక్స్‌లు క‌ట్టాల్సిన ప‌ని ఉండ‌దు. రాజీ ప‌డ‌టానికి చంద్ర‌బాబు ఎవ‌రు? ఆ ర‌కంగా ప్ర‌పోజ‌ల్స్‌ను ప‌క్క‌న‌పెట్టి కేంద్రం, చంద్ర‌బాబు క‌ల‌సి ఏపీ ప్ర‌జ‌ల హ‌క్కులను తాక‌ట్టు పెట్టే  అధికారం ఎవ‌రిచ్చారు.
-మోడీ మాట్లాడిన మాట‌లు బాధ‌క‌లిగిస్తే..కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా ఏం మాట్లాడార‌ని గ‌మ‌నిస్తే..ఆయ‌న ప్ర‌స్తావ‌న‌లో అర నిమిషం కూడా ఏపీ గురించి మాట్లాడ‌లేదు. ఎక్క‌డా కూడా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిన ధ‌ర్మ‌ముంది. మేం ఇస్తాం..మీరు ఎందుకు ఇవ్వ‌ర‌న్న మాట ఆయ‌న నోటి నుంచి రాలేదు. నిజంగా ఒక‌వైపున వీళ్ల ప్ర‌సంగాలు ఇంత బాధ క‌లిగిస్తుంటే..
- మ‌రోవైపు చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్తించిన తీరు ఇంకా బాధ‌క‌లిగిస్తుంది. నిన్న చంద్ర‌బాబు త‌ర‌ఫున మాట్లాడిన గ‌ళ్ల జ‌య‌దేవ్ వ్యాఖ్య‌లు చేస్తే.. ఆ మాట‌లు గ‌త నాలుగేళ్లుగా  మేం చెబుతున్న‌వి కావా? అని అడుగుతున్నాను. చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నిస్తున్నాను. గ‌ల్ల జ‌య‌దేవ్ మాట్లాడిన మాట‌లు నాలుగేళ్లుగా మేం మాట్లాడిన మాట‌లు అసెంబ్లీ రికార్డులు తిర‌గేయండి. యువ‌బేరీ ప్ర‌సంగాలు, ఢిల్లీలో మేం ఇచ్చిన అర్జీలు చూడండి, ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు మేం చేసిన పోరాటాలు చూడండి. ఇదే అంశాలు మాట్లాడితే ఆ రోజు మ‌మ్మ‌ల్ని ఎక్కిరించారు. ఎంత‌టి దారుణంగా ఎక్కిరించారంటే..ప్ర‌త్యేక హోదా వేస్టు, కోడ‌లు మ‌గ‌బిడ్డ‌ను కంటానంటే అత్త వ‌ద్దంటుందా? స‌ంజీవినా అన్నారు. వీరు మాట‌లు చూస్తు 
అంద‌రూ విస్తు పోయారు. చంద్ర‌బాబు ఆ రోజు అసెంబ్లీలో ఈ పుస్త‌కం పంపిణీ చేశారు. అంత‌టితో ఆగ‌కుండా 2015లో మ‌హానాడులో తీర్మానం చేశారు. హోదా ఉన్న రాష్ట్రాల‌కు , లేని రాష్ట్రాల‌కు తేడా లేద‌ని చెప్పారు. హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి అంతంత మాత్ర‌మే. ఉనికి కోసం ప్ర‌తిప‌క్షం ఆరాట‌మ‌ని మ‌హానాడులో తీర్మానం పెట్టారు.
- మార్చి 2న, 2014న కేంద్ర కేబినెట్ అప్ప‌ట్లో ప్ర‌త్యేక హోదా ఏపీకి ఇవ్వండ‌ని ప్లానింగ్ క‌మిష‌న్ నివేదిక ఇచ్చింది. ఏడు నెల‌ల పాటు చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాను ఎందుకు ప‌ట్టించుకోలేదు. కేబినెట్‌లో తీర్మానం అయిన అంశం, ప్లానింగ్ క‌మిష‌న్‌ను ఎందుకు అడ‌గ‌లేదు. ఇది  అన్యాయ‌మ‌ని చంద్ర‌బాబుకు అనిపించ‌లేదా?  
-సెప్టెంబ‌ర్ 7, 2016లో అరుణ్‌జైట్లీ ప్యాకేజీ ప్ర‌క‌ట‌న చేసిన స‌మ‌యంలో చంద్ర‌బాబుకు సంబంధించిన మంత్రులు లేరా? అరుణ్‌జైట్లీ ఇచ్చిన ప్యాకేజీని చంద్ర‌బాబు ఆమోదంతోనే విడుద‌ల చేస్తున్నామ‌ని వారు చెప్పారు. అదే చంద్ర‌బాబు అదే రాత్రి స్వాగ‌తించ‌డం, మ‌రుస‌టి రోజు అసెంబ్లీలో ధ‌న్య‌వాద తీర్మానాలు చేయ‌డం ధ‌ర్మ‌మేనా?
-జ‌న‌వ‌రి 27, 2017న చంద్ర‌బాబు ప్రెస్‌మీట్ పెట్టి మ‌న‌మే ఎక్కువ సాధించాం. ఇంత‌క‌న్నా ఎక్కువ ఏ రాష్ట్ర‌మైనా సాధించిందా? ప‌్ర‌తిప‌క్షాల‌కు చంద్ర‌బాబు స‌వాల్ చేశారు. 
- ఇంత‌టి దారుణంగా చంద్ర‌బాబు మోసం చేసిన తీరు క్లైమాక్స్‌కు ఎక్క‌డికి వ‌చ్చింద‌టే 2018 ఏప్రిల్‌లో బ‌డ్జెట్ చివ‌రి స‌మావేశాల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు విసుగు చెంది చేసిన అన్యాయాన్ని గ‌ట్టిగా తెల‌ప‌డం కోసం ఐదుగురు ఎంపీలు ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమ‌ర‌ణ దీక్ష చేశారు. అదే రోజు చంద్ర‌బాబు త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించి ఉంటే దేశం మొత్తం మ‌న‌వైపు చూసేది కాదా? ఇది తెలిసి చంద్ర‌బాబు త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించ‌క‌పోవ‌డం ధ‌ర్మ‌మేనా?
- ఇప్పుడు కూడా చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరును గ‌మ‌నించండి. ఒక‌వైపు బీజేపీతో యుద్ధ‌మంటారు. నిజంగా ఈయ‌న యుద్ధం చేస్తున్నారా?  సామాన్యుడికి కూడా అనుమానం వ‌స్తుంది. మ‌హారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్య‌ను టీటీడీ బోర్డు మెంబ‌ర్‌గా నియ‌మించారు.  ఎన్‌టీఆర్ బ‌యోపిక్ అనే బాల‌కృష్ణ సినిమా షూటింగ్ షెట్స్‌లో వెంక‌య్య‌నాయుడు క‌నిపిస్తారు. ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ఇక్క‌డ చంద్ర‌బాబు కొలువులో ఉంటారు. ఆయ‌న భార్య నిర్మాల సీతారామ‌న్ కేంద్రంలో మోడీతో మ‌ద్ద‌తు ఇస్తు గట్టిగా మాట్లాడారు. నిన్న రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ..చంద్ర‌బాబు మాకు మంచి మిత్రుడు, ఈ బంధం ఎప్ప‌టికీ వీడుపోదు అన్నారు. అది యుద్ధం కాదు..వేరే లోపాయికారిగా వేరేవి జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌ల త‌రువాత నాలుగేళ్లు బీజేపీతో క‌లిసి చంద్ర‌బాబు సంసారం చేస్తాడు. ఎన్నిక‌ల‌కు ఆరునెల‌ల ముందు విడాకులు తీసుకొని డ్రామాలాడుతున్నారు. ఆయ‌న చేసే యుద్ధంలో నిజాయితీ లేదు.
- చంద్ర‌బాబు నిన్న మీ ఎంపీ గ‌ల్ల జ‌య‌దేవ్ పార్ల‌మెంట్‌లో చూపించిన ప్ర‌తి లేఖ మేం ఎన్నోసార్లు చూపించాం. ప్ర‌త్యేక హోదా అంశంపై అభిజిత్‌సేన్ లేఖ‌ను మేం అసెంబ్లీలోనే చూపించాం. మార్చి 2, 2014న అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా ఏపీకి ఇస్తు ప్లానింగ్ క‌మిష‌న్‌కు ఇస్తు చేసిన తీర్మానం చంద్ర‌బాబుకు ఎన్నోసార్లు చూపించాం. వైవీ సుబ్బారెడ్డి లోక్‌స‌భ‌లో వేసిన ఆన్‌స్టార్డ్ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ..ప్ర‌త్యేక హోదా కొన‌సాగుతుంద‌ని వారే ఇచ్చారు. ఇవ‌న్నీ నాలుగేళ్లుగా మేం చూపిస్తున్నా..మీరు ఎవ‌రూ కూడా ప‌ట్టించుకోలేదు. యువ‌భేరీలో ఈ ర‌కంగా క‌ర‌ప‌త్రాలు ప్ర‌చారం చేశాం. గ‌త నాలుగేళ్లుగా ఈ విధంగా పోరాటం చేస్తున్నాం. వెబ్‌సైట్లో పెట్టాం. లింక్‌లు కూడా పెట్టాం. ప్ర‌త్యేక హోదా కోసం మేం ఎన్ని పోరాటాలు చేశామ‌న్న‌ది డేట్ల‌తో స‌హా వెబ్‌సైట్ల‌లో క‌నిపిస్తుంది. నిన్న కూడా మోసాలు కొన‌సాగింపుగా డ్రామాలాడుతున్నారు.
- మేం అవిశ్వాసం పెట్టిన‌ప్పుడు మీకు బీజేపీతో ఉన్న సంబంధాల‌తో రాకుండా చేశారు. మీరు పెట్టిన వెంట‌నే అంగీక‌రించ‌డం, మీకే మొద‌ట ప్ర‌సంగించేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం మంచిదే. అవిశ్వాసంలో జ‌రిగిన ప‌రిస్థితి చూశాం. అవిశ్వాసం వీగిపోయింది. ఇప్పుడు మీ ఎంపీలు మొత్తం రాజీనామా చేయండి. మా ఎంపీలు ఆల్‌రెడీ రాజీనామా చేయండి. 25 మంది ఎంపీలు రాజీనామా చేసి రండి మ‌రోసారి దీక్ష‌కు కూర్చుందాం.మా ఎంపీల‌ను పంపిస్తాను. కేంద్రం దిగిరాదేమో చూద్దాం. దేశం మొత్తం మ‌న‌వైపు చూడ‌దేమో చూద్దాం. కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాం. యుద్ధ‌మంటే ఇలా చేయండి అని సామాన్యులు అడుగుతారు. చంద్ర‌బాబు ఇది చేయ‌డు. ఇది చేసేట్టుగా చంద్ర‌బాబుపై ఒత్తిడి వ‌చ్చేట్లుగా, బీజేపీ చేస్తున్న అన్యాయానికి నిర‌స‌న‌గా ఏపీలో మంగ‌ళ‌వారం ఏపీ బంద్‌కు పిలుపునిస్తున్నాం. చంద్ర‌బాబు ఎంపీల మీద ఒత్తిడి రావాలి. త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించాలి. ప్ర‌త్యేక హోదా కోసం ఒక‌తాటిపైకి వ‌చ్చి నిరాహార‌దీక్ష‌కు కూర్చోవాలి. ఈ దిశ‌గా చంద్ర‌బాబుపై ఒత్తిడి రావాలి. ఈ బంద్ ద్వారా ఏపీ ప్ర‌జ‌లు మీపైన నిర‌స‌న తెలుపుతున్నార‌ని కేంద్రానికి అర్థం కావాలి. ఏపీలో ప్ర‌త్యేక హోదా అన్న డిమాండు ఏవిధంగా ఉంది అన్న‌ది మిగిలిన రాష్ట్రాల‌కు అర్థం కావాలి. ఈ పెద్ద మ‌నిషి చంద్ర‌బాబు ఢిల్లీకి వెళ్లి మిగిలిన పార్టీల‌కు కృత‌జ్ఞ‌త‌ల‌కు తెలుపుతార‌ట‌. ఎవ‌రి అజెండా వారు వాడుకున్నారు. విమానాల కొనుగోలుకు సంబంధించిన స్కాములు అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌లో మాట్లాడారు. ఏపీకి జ‌రిగిన బాధ ఎక్క‌డ క‌నిపించ‌లేదు. ఈయ‌న వెళ్లి జాతీయ మీడియాతో మాట్లాడుతార‌ట‌. మొత్తం ఎంపీల‌తో రాజీనామా చేయించు, మా ఎంపీలు నీకు స‌హ‌క‌రిస్తారు. అప్పుడు జాతీయ మీడియానే మీ వ‌ద్ద‌కు వ‌స్తుంది. కేంద్రంలోని మిగ‌తా పార్టీలు అన్నీ నీ వ‌ద్ద‌కు వ‌స్తాయి. చేసే ప‌నిలో చిత్త‌శుద్ది, నిజాయితీ ఉండాలి. ఏపీ ప్ర‌జ‌ల‌కు ఒక్క‌టే విజ్ఞ‌ప్తి చేస్తున్నాను . ఎవ‌రిని న‌మ్మొద్దు..కాంగ్రెస్‌ను న‌మ్మితే అన్యాయంగా రాష్ట్రాన్ని విడ‌గొట్టారు. వారు ప్ర‌త్యేక హోదాను చ‌ట్టంలో పెట్టి ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లి తెచ్చుకునేవారం. రైల్వేజోన్‌, క‌డ‌ప స్టీల్ ఫ్యాక్ట‌రీ, క్రూడాయిల్‌, ఏది తీసుకున్నా కూడా అన్నీ కూడా చ‌ట్టంలో మే..మే..మే అని పెట్టారు. ఎందుకు ష‌ల్ ..ష‌ల్ అని పెట్ట‌లేదు. క‌చ్చితంగా చేయాల‌ని పెట్టి ఉంటే ఈ రోజు బీజేపీకి ఈ వెసులుబాటు ఉండేది కాదు. 
-బీజేపీ అధికారంలో ఉన్నారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టారు. నాలుగేళ్ల‌లో ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదు. వాళ్ల‌ను న‌మ్మ‌లేదు
- చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా సంజీవ‌ని, ప‌దిహేనుఏళ్లు కావాల‌న్నారు. తెస్తామ‌న్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆయ‌న ప్ర‌త్యేక‌హోదాకు ఏర‌కంగా తూట్లు పొడిచారో అంద‌రం చూశాం. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌లు ముందు డ్రామాలు ఆడుతున్నారు. ఈయ‌న‌ను న‌మ్మొద్దు. 25కు 25 మంది ఎంపీల‌ను ఒక తాటిపై నిల‌బెట్టండి. వైయ‌స్ఆర్‌సీపీకి మ‌ద్ద‌తుగా నిల‌వండి. ఎవ‌రైతే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని సంత‌కం చేస్తారో వారికే మ‌ద్ద‌తిస్తాం. ఆ వెసులుబాటు మ‌న చేతుల్లో పెట్టుకుందాం. దాన్ని పోరాటం అంటారు. రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో ఇవాళ కాన్ఫిడెన్స్ లేకుండా చేశారు. చంద్ర‌బాబులో నిజాయితీ రావాల‌ని, ఆయ‌న‌పై ఒత్తిడి పెంచేందుకు, ఆయ‌న ఎంపీల‌తో రాజీనామా చేయించేందుకు, వారికి అర్థం కావాల‌ని మంగ‌ళ‌వారం బంద్‌కు పిలుపునిస్తున్నాను. ప్ర‌తి పార్టీని, ప్ర‌తి సంఘాన్ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. స‌హ‌క‌రించండి. ప్ర‌తి షాప్ ఓన‌ర్‌ను స‌హ‌క‌రించ‌మ‌ని కోరుతున్నాను. అంద‌రూ తోడుగా నిల‌వండి అని విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. 




Back to Top