రేప‌టి నుంచి చిత్తూరు జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర

 

చిత్తూరు : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్  జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజ‌య‌వంతంగా సాగుతోంది. బుధ‌వారంతో అనంత‌పురం జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసింది. గురువారం నుంచి చిత్తూరు జిల్లాలో యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేర‌కు 46వ రోజు షెడ్యూలు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట మండలం బలిజపల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర ప్రారంభ‌మ‌వుతుంది. ఉదయం 8.30 గంటలకు చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తారు. తంబళ్లపల్లి నియోజక వర్గం ఎద్దుల వారి కోటలో పార్టీ జెండా ఎగురవేస్తారు. అనంతరం 9.30 గంటలకు ఎద్దుల వేమనగిరి పల్లి చేరుకొని పార్టీ జెండా ఎగరవేస్తారు. ఆర్‌ఎన్‌ తాండా, కొట్టాల క్రాస్‌ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. వైయ‌స్‌ జగన్‌ మద్యాహ్నం 12గంటలకు  వసంతపురం చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.  
 
Back to Top