బాబు పట్టించుకోవడం లేదు

 • మీరైనా జోక్యం చేసుకోండి
 • గవర్నర్‌ను కోరిన వైయస్‌ జగన్‌
 • నోట్ల రద్దు తదనంతరం పరిణామాలపై గవర్నర్‌ను కలిసిన వైయస్‌ జగన్, ప్రతినిధి బృందంæ
 • ఇప్పటివరకు ఏపీలో రూ.12.41 లక్షల కోట్ల డిపాజిట్లు..
 • రాష్ట్రానికి కొత్త నోట్లు వచ్చింది కేవలం రూ.5.50 లక్షల కోట్లే
 • జనాభా ప్రతిపాదికన ఏపీకి ఇంకా రూ.24 లక్షల కోట్లు రావాలి
 • డిపాజిట్లు, సర్క్యూలేషన్‌ విషయంలో ఎవరికీ క్లారీటి లేదు
 • ప్రధాని కోరిన గడువు తీరాక పరిస్థితులు చక్కబడకపోతే ఉద్యమం
 • నోట్ల రద్దు విషయం బాబుకు ముందే తెలుసు
 • టీడీపీ నేతలు నల్లధనాన్ని సులువుగా మార్చుకున్నారు
 • ఈ తతంగమంతా బ్లాక్‌మనీ కోసం కాదు..ట్యాక్స్‌ బేస్‌ పెంచడం కోసమే
 • మీడియాతో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

 • హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని, కనీసం మీరైనా జోక్యం చేసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. నోట్ల రద్దు, తదనంతరం ప్రజల ఇబ్బందులను మంగళవారం వైయస్‌ జగన్, ప్రతినిధి బృందం గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. 42 రోజులుగా రాష్ట్రంలోని రైతులు, సామాన్య ప్రజలు, వ్యాపారులు నష్టపోయిన అంశాలను గవర్నర్‌కు వివరించారు. జనాభా ప్రతిపాదికన ఏపీకి రావాల్సిన నగదు రాలేదని, మీరు జోక్యం చేసుకొని ప్రధాని, ఆర్‌బీఐ అధికారులతో చర్చించి డిపాజిట్లకు అనుగుణంగా కొత్త నోట్లను తెప్పించాలని వైయస్‌ జగన్‌ గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌ భేటీ అనంతరం ప్రతిపక్ష నేత మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.15.25 లక్షల కోట్ల విలువ చేసే పాత నోట్లను రద్దు చేగా..అందులో రూ.5.5 లక్షల కోట్ల కొత్త కరెన్సీ మాత్రమే ఆర్‌బీఐ పంపిణీ చేసిందన్నారు. రద్దు చేసిన  నోట్ల విలువతో పోలిస్తే..ఇది 33 శాతమే అని తెలిపారు. నోట్ల రద్దు తరువాత ఏపీలో రూ.60 వేల కోట్లకు పైగా పాత నోట్లు డిపాజిట్‌ అయ్యాయని, అయితే ఈ నెల 15వ తేదీ నాటికి కేవలం రూ.14,740 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఏపీ జనాభా ప్రకారం రాష్ట్రానికి ఇంకా రూ.24 వేల కోట్ల కొత్త కరెన్సీ రావాల్సిన అవసరం ఉందన్నారు. పాత నోట్ల డిపాజిట్లకు అనుగుణంగా కొత్త కరెన్సీ అందుబాటులోకి రాకపోతే..అసంఘటిత రంగానికి చెందిన రైతులు, రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందన్నారు.  రబీ 24.6 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉండగా నోట్ల రద్దు కారణంగా 9 లక్షల హెక్టార్లలోనే పంటలు వేశారన్నారు. ఈ ఏడాది రైతులకు రుణాలు 14 శాతమే ఇచ్చారన్నారు.  మొత్తం డబ్బులు తీసుకొని రాకపోతే అన్ని రకాలుగా ప్రజలు నష్టపోతారని వైయస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు విషయంలో ప్రజల కష్టాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని, కనీసం మీరైనా స్పందించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా డబ్బులు వచ్చేలా చూడాలని గవర్నర్‌ను కోరినట్లు వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. నోట్ల రద్దు విషయం గవర్నర్‌ సబ్జెట్‌ కాకపోవచ్చు. ఆయన ఒక బాధ్యత గతల స్థానంలో ఉన్నారు కాబట్టి కలిశామన్నారు. గవర్నర్‌కు ప్రధానితో మాట్లాడే వీలుంటుందని చెప్పారు. ఆర్‌బీఐతో చర్చించి సమస్యకు పరిష్కార మార్గం చూపే అవకాశం ఉందని గవర్నర్‌ను కలిసినట్లు వైయస్‌ జగన్‌ వివరించారు.  
  బాబు ముందే చక్కబెట్టుకున్నారు
  నోట్ల రద్దు విషయం సీఎం చంద్రబాబుకు ముందే తెలుసుని, అందువల్లే ఆయన, ఆయన అనుచరులు ఈ ప్రభావం పడకుండా ముందుగానే అన్నీ చక్కబెట్టుకున్నారని వైయస్‌ జగన్‌ ఆరోపించారు. నోట్ల రద్దుపై ప్రధాని ప్రకటన చేయడానికి కేవలం రెడు రోజుల ముందే బాబు హెరిటేజ్‌ షేర్లను ఫ్యూచర్‌ గ్రూప్‌నకు అమ్ముకున్నారని విమర్శించారు. నోట్ల రద్దు విషయం ముందే తెలుసుకున్న చంద్రబాబు అక్టోబర్‌ 12న  నరేంద్రమోడీకి లేఖ రాశారని తెలిపారు. ఇలాంటి అంశాలపై లేఖ రాయాలని ఎవరికీ తట్టదన్నారు. మోడీకి లేఖ రాస్తే ఎవరబ్బా పిచ్చోడు లేఖ రాశాడు అని అనుకుంటారని ఎద్దేవా చేశారు. ఎప్పుడు జరగనిది, ఎప్పుడు చూడనిది సడన్‌గా బాబు లేఖ రాయడం ఆశ్చర్యకరమన్నారు. నోట్ల రద్దు విషయం ముందే తెలియడంతోనే ఈ విషయంలోనూ క్రెడిట్‌ కోసం ఆయన ప్రధానికి లేఖ రాశారని విమర్శించారు.
  ఇది బ్లాక్‌మనీ కోసం కాదు..
  కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై వైయస్‌ జగన్‌ అనుమానం వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో ప్రజలు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి అగచాట్లు పడుతున్నారని, ఇది బ్లాక్‌మనీ కోసం జరుగుతున్న ప్రక్రియలా లేదన్నారు. డిపాజిట్లు పెరిగే కొద్దీ ఈ అమౌంటే అందుబాటులోకి రావాలని, అయితే అరకొరగా కొత్త నోట్లు పంపిణీ చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ట్యాక్స్‌ బేస్‌ పెంచడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఉందని వైయస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. డిపాజిట్లు, మనీ సర్క్యూలేషన్‌ విషయంలో ఎవరికీ క్లారీటీ లేదని చెప్పారు. డిసెంబర్‌ 31 దాకా మోడీ టైం అడిగారని, ఆ తరువాత 1, 2,3 వ తేదీల్లో ప్రజల ఇబ్బందులను గమనించి ప్రజా ఉద్యమం చేపడుతామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడించారు.
Back to Top