ప్రత్యేక హోదా పై చైతన్య పరిచే దిశగా వైఎస్ జగన్

హైదరాబాద్: ప్రత్యేక హోదాపై ప్రజల్ని చైతన్య పరచాలని ప్రతిపక్ష నేత, వైెఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం నేరుగా ఆయన రంగంలోకి దిగారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. నగర, పట్టణ, జిల్లా శాఖల అధ్యక్షుల్నిసమావేశ పరిచారు. ప్రత్యేక హోదా తో యువతకు ఒనగూరే ప్రయోజనాల్ని చర్చించారు.  

రద్దు చేయించారు..
అనంతరం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధా మీడియాతో మాట్లాడారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీలో జరగాల్సిన వైఎస్ జగన్ సమావేశాన్ని కుట్రతోనే రద్దు చేయించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారనే భయంతోనే ఈ చర్యకు దిగారని ఆయన అన్నారు.

Back to Top