నేడు రాజ్నాథ్ను కలవనున్న వైఎస్ జగన్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ బృందం కూడా హోం మంత్రిని కలుస్తుంది.

ఓటుకు కోట్ల వ్యవహారంపై నమోదైన కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎ-1గా చేర్చాలంటూ కేంద్ర హోం మంత్రికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం ఇవ్వనున్నారు.
Back to Top