<br/>హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఆయన స్వగృహంలో హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ నెల 25న విశాఖ ఎయిర్ పోర్టులో వైయస్ జగన్‌పై టీడీపీకి చెందిన శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడి చేసిన విషయం విధితమే. దీంతో జననేతకు సిటీ న్యూరో సెంటర్‌లో ఆపరేషన్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు వైద్యులు మరోమారు ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. శాంపుల్స్ రిపోర్ట్‌లో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. వైయస్ జగన్‌కు విశ్రాంతి అవసరమని స్పష్టం చేశారు.