వైయస్‌ జగన్‌కు గిరిజనుల అండ..

టీడీపీ పాలనలో కష్టాలు,కన్నీళ్లు...
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి
విజయనగరంః ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం దురదృష్టకరమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అన్నారు. దేవుడి దయతో వైయస్‌ జగన్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారన్నారు. జననేతకు ప్రజలందరూ అండగా ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం గిరిజనులపై వివక్ష చూపించిందన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే  వస్తే బాధలు తీరిపోతాయని గిరిజనులు ఎదురుచూస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌కు దేవుడి ఆశీస్సులు ఉన్నాయన్నారు. జననేతపై హత్యాయత్నం పట్ల గిరిజనులు తల్లడిల్లి పోయారన్నారు. జగన్‌ కోసం ప్రార్థనలు,పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రతో అందరి మధ్యలోకి వచ్చి కష్టాలు తెలుసుకుంటూ నిత్యం ప్రజలతో మమేకమవుతున్న వైయస్‌ జగన్‌కు గిరిజనులు మద్దతు ఉందన్నారు. టీడీపీ పాలనలో కష్టాలు,కన్నీళ్లు తప్ప ప్రజలకు ఏమి మిగలలేదన్నారు.   వైయస్‌ జగన్‌ను కళ్లారా చూడాలని, తమ అభిమాన జననేతకు తమ సమస్యలను చెప్పుకోవాలని దారి పొడవునా గిరిజనులు ఎంతో ఆశతో నమ్మకంతో ఎదురుచూస్తున్నారన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top