జగనన్న సాయమే..పాపకు ప్రాణాలు పోసింది...

శ్రీకాకుళంః  మృత్యుఒడిలో ఉన్న తమ పాపకు వైయస్‌ జగన్‌ చేసిన సాయమే ప్రాణాలు పోసిందని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం సీతంపేట గ్రామానికి చెందిన  దంపతులు అన్నారు. వైయస్‌ జగన్‌ను కలిసిన ఆ దంపతులు పాపను చూపించి కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యం ఉన్న తమ బిడ్డకు వైయస్‌ జగన్‌ ఉచితంగా ఆపరేషన్‌ చేయించారని తెలిపారు.  పాపకు తలలో నీరు చేరడంతో బతకడం కష్టమని వైద్యులు తెలిపారని,అక్టోబర్‌ 21న వైయస్‌ జగన్‌ను కలిసి బాధ చెప్పుకున్నామన్నారు. నేనున్నానంటూ జననేత తక్షణమే స్పందించి మెరుగైన వైద్యం చేయించారన్నారు. మా కుటుంబం జగన్నకు  రుణపడి ఉంటుందన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే  ఎంతోమంది పిల్లలు భవిష్యత్‌ బాగుంటుందన్నారు. పేదలకు మేలు జరుగుతుందన్నారు.  ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారన్నారు. 
 
Back to Top